ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడు ఘటన బాధితులను పరామర్శించేందుకు ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించారు. బాధితులు, వారి కుటుంబసభ్యులతో మాట్లాడారు. వారికి అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకున్నారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు.

ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి, బాధితులకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. "కుట్రదారులను న్యాయస్థానం ముందు నిలబెడతాం" అని స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:

"ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి వెళ్లి ఢిల్లీ పేలుడు ఘటనలో గాయపడిన వారిని పరామర్శించాను. వాళ్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
ఈ ఘటనకు కారణమైన కుట్రదారులకు కచ్చితంగా శిక్ష పడుతుంది"
Went to LNJP Hospital and met those injured during the blast in Delhi. Praying for everyone’s quick recovery.
— Narendra Modi (@narendramodi) November 12, 2025
Those behind the conspiracy will be brought to justice! pic.twitter.com/HfgKs8yeVp


