ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఏఎఫ్ఎస్ ఆదంపూర్‌ను ఈ రోజు సందర్శించారు. మన దేశ సాహసిక యోధులను, సైనికులను కలుసుకోవడం కోసం ప్రధాని అక్కడికి వెళ్లారు. ‘‘ధైర్యం-సాహసం, దృఢ సంకల్పం, నిర్భయత్వం మూర్తీభవించిన వారితో భేటీ కావడం చాలా ప్రత్యేకమైన అనుభూతినిచ్చింది’’ అని శ్రీ మోదీ అభివర్ణించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఆ సందేశంలో:
‘‘ఈ రోజు ఉదయం, నేను ఏఎఫ్ఎస్ ఆదంపూర్‌కు వెళ్లాను.. శూరులైన మన వాయుసేన యోధులనూ, సైనికులనూ కలుసుకున్నాను. ధైర్యం-సాహసం, దృఢ సంకల్పం, నిర్భయత్వం మూర్తీభవించిన వారితో భేటీ కావడం చాలా ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది. మన దేశ ప్రజల కోసం సర్వస్వాన్ని ఒడ్డే మన సాయుధ బలగాలకు భారత్ ఎప్పటికీ కృతజ్ఞురాలుగా ఉంటుంది’’ అని పేర్కొన్నారు.


Earlier this morning, I went to AFS Adampur and met our brave air warriors and soldiers. It was a very special experience to be with those who epitomise courage, determination and fearlessness. India is eternally grateful to our armed forces for everything they do for our nation. pic.twitter.com/RYwfBfTrV2
— Narendra Modi (@narendramodi) May 13, 2025


