సర్దార్ వల్లభ్‌భాయి పటేల్ 150వ జయంతి సందర్భంగా ఈ నెల 31న నిర్వహిస్తున్న ‘ఏకతా పరుగు’ కార్యక్రమంలో భాగం పంచుకోవాల్సిందిగా దేశ పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని జాతీయ ఏకతా దినోత్సవ నేపథ్యంలో ఏర్పాటు చేస్తున్నారు. భారతదేశ ప్రజలు ఏకతాటి మీద నిలిచి, ఎప్పటికీ కలసిమెలసి ఉండాలని సర్దార్ పటేల్ కన్న కలను పండుగలా నిర్వహించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
భారత ఏకతా దినోత్సవానికి సంబంధించి ‘ఎక్స్’లో నమోదు చేసిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూ, ఇలా రాశారు:
‘‘అక్టోబరు 31న ఏకతా పరుగులో అంతా పాలుపంచుకోండి.. ఐకమత్య భావనను వేడుకలా నిర్వహించుకొందాం. రండి, సర్దార్ పటేల్ కన్న అఖండ భారత్ కలను మనమందరం గౌరవించుకొందాం.’’
Join the Run for Unity on 31st October and celebrate the spirit of togetherness! Let’s honour Sardar Patel’s vision of a united India. https://t.co/KalRcynMIi
— Narendra Modi (@narendramodi) October 27, 2025


