గుజరాత్‌లో నిర్వహించే రాన్ ఉత్సవ్‌ను తిలకించాల్సిందిగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హిందీ సినీ దిగ్గజం అమితాబ్ బచ్చన్‌ను కోరారు. దీంతోపాటు ఐక్యతా విగ్రహం పర్యాటక ప్రాంతాన్ని కూడా సందర్శించాలని సూచించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“పార్వతీ కుండ్, జగేశ్వర్ ఆలయాల సందర్శన ఎంతో అద్భుతం.. ఆ వైభవం చూసి నేను అప్రతిభుడనయ్యాను. ఇక కొద్దిరోజుల్లో రాన్ ఉత్సవ్ ప్రారంభం కాబోతోంది. ఈ వేడుకలను తిలకించడం కోసం కచ్‌ను సందర్శించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. అలాగే ఐక్యతా విగ్రహం పర్యాటక ప్రాంతానికీ వెళ్లాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
My visit to Parvati Kund and Jageshwar Temples was truly mesmerising.
— Narendra Modi (@narendramodi) October 15, 2023
In the coming weeks, Rann Utsav is starting and I would urge you to visit Kutch. Your visit to Statue of Unity is also due. https://t.co/VRyRRy3YZ8


