‘కోవిడ్-19 ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు ఉద్దేశించిన స్వల్పకాలిక పాఠ్యక్రమం’ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ నెల 18 న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. దీనితో 26 రాష్ట్రాల లో విస్తరించివున్న 111 శిక్షణ కేంద్రాల లో ఈ కార్యక్రమం మొదలవుతుంది. ఈ కార్యక్రమం అనంతరం ప్రధాన మంత్రి ప్రసంగం ఉంటుంది. నైపుణ్యాభివృద్ధి, నవపారిశ్రామికత్వ శాఖ కేంద్ర మంత్రి కూడా ఈ కార్యక్రమం లో పాలుపంచుకొంటారు.
దేశవ్యాప్తం గా ఒక లక్ష మంది కి పైగా కోవిడ్ యోధుల కు నైపుణ్యాల ను సంతరించడం తో పాటు ప్రావీణ్యాల కు మెరుగులు దిద్దాలన్నది కూడా ఈ కార్యక్రమం ధ్యేయం గా ఉంది. హోం కేర్ సపోర్టు, బేసిక్ కేర్ సపోర్టు, అడ్వాన్స్ డ్ కేర్ సపోర్టు, ఇమర్జన్సి కేర్ సపోర్టు, నమూనా సేకరణ లో మద్ధతు, చికిత్స సంబంధిత సామగ్రి పరం గా మద్ధతు అనే ఆరు ప్రత్యేక విధుల ను నిర్వహించడం లో కోవిడ్ యోధుల కు శిక్షణ ను ఇవ్వడం జరుగుతుంది.
ఈ కార్యక్రమాన్ని ఒక ప్రత్యేక కార్యక్రమం గా ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 3.0 లో సెంట్రల్ కాంపొనంట్ లో భాగం గా మొత్తం 276 కోట్ల రూపాయల ఆర్థిక వ్యయం తో రూపొందించడం జరిగింది. ఆరోగ్య రంగం తాలూకు వర్తమాన కాలం అవసరాల ను, అలాగే భవిష్యత్తు కాలం అవసరాల ను తీర్చడం కోసం నైపుణ్యం కలిగిన చికిత్సేతర ఆరోగ్య సంరక్షణ కార్యకర్తల ను ఈ కార్యక్రమం తయారు చేయనుంది.
Published By : Admin |
June 16, 2021 | 14:33 IST
Login or Register to add your comment
List of Outcomes: State Visit of Prime Minister to Maldives
July 26, 2025