భూకంప విషాదం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు మయన్మార్ సీనియర్ జనరల్ గౌరవనీయ మిన్ ఆంగ్ హ్లెయింగ్‌తో మాట్లాడారు. ఈ క్లిష్ట సమయంలో మయన్మార్‌కు అండగా నిలవడంలో సన్నిహిత మిత్రదేశంగా, పొరుగుదేశంగా భారత్ నిబద్ధతను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఈ విపత్తుకు ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించినట్లు తెలిపిన ప్రధానమంత్రి.. బాధిత ప్రాంతాలకు తక్షణ ఉపశమనాన్ని, అవసరమైన సాయాన్ని అందించనున్నట్లు ప్రకటించారు.

‘ఎక్స్’ వేదికగా ఆయన ఇలా పేర్కొన్నారు:

“మయన్మార్ సీనియర్ జనరల్ గౌరవనీయ మిన్ ఆంగ్ హ్లెయింగ్‌తో మాట్లాడాను. విధ్వంసకరమైన భూకంపం కారణంగా జరిగిన ప్రాణనష్టం పట్ల మన ప్రగాఢ సానుభూతిని తెలియజేశాను. సన్నిహిత మిత్రదేశంగా, పొరుగుదేశంగా ఈ క్లిష్ట సమయంలో యావత్ భారత్ మయన్మార్‌కు అండగా ఉంటుంది. #ఆపరేషన్ బ్రహ్మలో భాగంగా విపత్తు సహాయ సామాగ్రి, మానవతా సాయం, సెర్చ్, రెస్క్యూ బృందాలను ప్రభావిత ప్రాంతాలకు వెంటనే పంపిస్తున్నాం’’.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's banking sector resilient; 11-13% credit growth for January-June likely: Survey

Media Coverage

India's banking sector resilient; 11-13% credit growth for January-June likely: Survey
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 20 ఏప్రిల్ 2026
April 20, 2026

Honouring Saints, Powering Futures: PM Modi’s Leadership That Blends Heritage, Highways and High Growth