బెల్జియమ్ రాజు శ్రీ ఫిలిప్‌తో ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మాట్లాడారు. యువరాణి ఆస్ట్రిడ్ సారథ్యంలో బెల్జియం ఎకనామిక్ మిషన్ ఇటీవల భారత్‌ను సందర్శించడాన్ని శ్రీ మోదీ ప్రశంసించారు.  ఇప్పటికే దృఢంగా ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తృతపరుచుకోవడం, వాణిజ్యాన్నీ, పెట్టుబడినీ  ప్రోత్సహించడంతోపాటు నవకల్పన, స్థిరత్వం కోసం పరస్పర సహకారాన్ని ముందుకు తీసుకుపోవడం అనే అంశాలపై బెల్జియమ్ రాజుతో ప్రధాని చర్చించారు.

‘ఎక్స్‌’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి  పొందుపరుస్తూ..
‘‘బెల్జియమ్ రాజు శ్రీ ఫిలిప్‌తో మాట్లాడడం చాలా సంతోషాన్ని కలిగించింది. యువరాణి ఆస్ట్రిడ్ నాయకత్వంలో  బెల్జియమ్ ఎకనామిక్ మిషన్ భారత్‌లో ఇటీవల పర్యటించడం అభినందనీయం. మన బలమైన ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస‌్తృతపరుచుకోవాలని, వాణిజ్యానికీ, పెట్టుబడులకూ ప్రోత్సాహాన్ని అందించడంతోపాటు నవకల్పన, స్థిరత్వపరంగా సహకారాన్ని ముందుకు తీసుకు పోవాలనే అంశాలపై  మేం చర్చించాం’’. @MonarchieBe”

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian economy set for robust growth, stronger markets after May 1: WTC

Media Coverage

Indian economy set for robust growth, stronger markets after May 1: WTC
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 22 ఏప్రిల్ 2026
April 22, 2026

One Nation, One Vision: PM Modi Delivers Healthcare Revolution, Security Revenge & Economic Self-Reliance