మన విద్యార్థుల్లో అసాధారణ ప్రతిభ సమృద్ధిగా ఉందనీ, వారిలో తమ కలలను నిజం చేసుకొనేందుకు పూర్తి సామర్థ్యం ఉందనీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. విద్యార్థులు వారి సామర్థ్యాలతో పాటు నైపుణ్యాలను ఉపయోగించి వ్యక్తిగత పురోగతినీ, విజయాన్నీ పొందడానికి మార్గదర్శకత్వం వహించడం ‘పరీక్షా పే చర్చా’ ఉద్దేశమని ఆయన అన్నారు.
ఈ సందర్భంగా -
‘‘విద్యా వితర్కో విజ్ఞానం స్మృతిస్తత్పరతా క్రియా
యస్యైతే షడ్గుణాస్తస్య నాసాధ్యమతివర్తతే’’ అనే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి పంచుకున్నారు.
ఈ శ్లోకానికి.. జ్ఞానం, తర్కం, విజ్ఞానం, స్మృతి, సమయ పాలనలతో పాటు దీక్షతో నిండి ఉండే వ్యక్తి సవాలు ఎలాంటిది అయినా విజయాన్ని సాధించగలుగుతారు.. మరి ఇలాంటి వ్యక్తికి ఏదీ అసంభవం కాదని అర్థం.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘అద్భుత ప్రతిభ సమృద్ధంగా ఉన్న మన విద్యార్థులకు, తమ కలల్ని నిజం చేసుకొనే పూర్తి సామర్థ్యం ఉంది. వారు తమ ప్రతిభనీ, కౌశలాన్నీ ఎలా సార్థకంగా ఉపయోగించుకోవచ్చో మార్గదర్శకత్వాన్ని అందించడం ‘పరీక్షా పే చర్చా’ లక్ష్యం’’ అని పేర్కొన్నారు.
अद्भुत प्रतिभा के धनी हमारे विद्यार्थियों में अपने सपनों को सच करने की पूरी क्षमता है। 'परीक्षा पे चर्चा' का उद्देश्य भी यही है कि कैसे वे अपनी प्रतिभा और कौशल का सार्थक इस्तेमाल कर सकते हैं।
— Narendra Modi (@narendramodi) February 9, 2026
विद्या वितर्को विज्ञानं स्मृतिस्तत्परता क्रिया।
यस्यैते षड्गुणास्तस्य… pic.twitter.com/7QajrvogC5


