నూతన సంవత్సరం 2026 సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఓ సుభాషితంలో సూచించిన ప్రకారం.. జ్ఞానం, వైరాగ్యం, ధనం, వీరత్వం, శక్తి, సామర్థ్యం, స్మృతి, స్వాతంత్య్రం, కౌశలం, ప్రతిభ, ధైర్యంలతో పాటు కోమలత్వం వంటి మంచి గుణాలతో పరిపూర్ణం కావడమే జీవన లక్ష్యమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
ప్రధానమంత్రి ప్రాచీన జ్ఞానాన్ని ఉదాహరిస్తూ,
‘‘కొత్త సంవత్సరం 2026 సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికీ కొత్త ఆశలనీ, కొత్త సంకల్పాన్నీ, అలాగే కొత్త ఆత్మవిశ్వాసాన్నీ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. జీవన గమనంలో ముందడుగు వేయడానికి ఈ సంవత్సరం అందరికీ ప్రేరణను అందించుగాక.
2026 की आप सभी को बहुत-बहुत शुभकामनाएं। कामना करते हैं कि यह वर्ष हर किसी के लिए नई आशाएं, नए संकल्प और एक नया आत्मविश्वास लेकर आए। सभी को जीवन में आगे बढ़ने की प्रेरणा दे।
— Narendra Modi (@narendramodi) January 1, 2026
ज्ञानं विरक्तिरैश्वर्यं शौर्यं तेजो बलं स्मृतिः।
स्वातन्त्र्यं कौशलं कान्तिर्धैर्यं मार्दवमेव च ॥ pic.twitter.com/vMhlHe3fGR


