పదకొండు సంవత్సరాల కిందట అమల్లోకి వచ్చిన ప్రధానమంత్రి ముద్రా యోజన యువతీ యువకులు స్వయం ఉపాధికి తోడ్పడిందని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఒక వ్యక్తికి సరైన అవకాశాలు ఇస్తే ఆ వ్యక్తి సొంత కాళ్ల మీద నిలబడడంతో పాటు దేశ పురోగతికి కూడా తన వంతు తోడ్పాటును అందించగలరని ఈ పథకం సాధించిన ఫలితం నిరూపించిందని ప్రధానమంత్రి అన్నారు. ఈ సందర్భంగా, సంస్కృత భాషలోని ఓ సుభాషితాన్ని ప్రజలతో శ్రీ మోదీ పంచుకున్నారు. వివేకం గల వ్యక్తి గుణగణాలను గురించి ఈ సుభాషితం మనకు చెబుతుంది.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -

‘‘ఇవాళ్టికి సరిగ్గా 11 సంవత్సరాల కిందట మొదలుపెట్టిన ప్రధానమంత్రి ముద్రా యోజన యువత స్వయం ఉపాధి కల్పనకు ఎంతో సహాయ పడింది. సరైన అవకాశాలు లభించినప్పుడు వ్యక్తి తన కాళ్ల మీద తాను నిలబడడమే కాకుండా, దేశ ప్రగతికి కూడా తోడ్పడగలుగుతారని ఈ పథకం సాధించిన విజయం నిరూపించింది.

ఆత్మజ్ఞానం సమారంభస్తితిక్షా ధర్మనిత్యతా

యమర్థా నాపకర్షన్తి స వై పండిత ఉచ్యతే

#11YearsOfMUDRA’’ అని పేర్కొన్నారు.

స్వీయ శక్తిసామర్ధ్యాల గురించి తెలుసుకుని, స్వావలంబన కలిగి మంచి పనులు చేస్తూ, ఓరిమితో కష్టాలను అధిగమిస్తూ, ఎప్పుడూ సన్మార్గంలోనే నడుస్తూ, దురాశకు లొంగకుండా ముందుకు సాగిపోయే వ్యక్తి నిజమైన వివేకశాలి.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
New Smart Drug RK-251 Developed as Replacement for Chemotherapy

Media Coverage

New Smart Drug RK-251 Developed as Replacement for Chemotherapy
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 ఆగష్టు 2026
August 21, 2026

Ease of Living Meets Strategic Strength: How India Is Building the Future in Real Time Under the Leadership of PM Modi