షేర్ చేయండి
 
Comments

ఎక్స్ లన్సీస్‌,

మీరందరు స్వ‌ల్ప‌ వ్య‌వ‌ధి లోనే ఈ ప్ర‌త్యేక సంభాష‌ణ‌ లో పాలు పంచుకొంటున్నందుకుగాను మీ అందరి కి నేను ధన్యవాదాలు తెలియజేయదలచాను.

ఇటీవలే శస్త్ర చికిత్స చేయించుకొన్న తరువాత మ‌న‌తో క‌ల‌సిన‌ మన మిత్రుడు ప్రధాని శ్రీ ఓలీ కి నేను ప్రత్యేకం గా ధన్యవాదాలు పలుకుతున్నాను. ఆయన శీఘ్రం గా కోలుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అధ్యక్షుడు శ్రీ అశ్ రఫ్ గనీ ఇటీవల తిరిగి ఎన్నిక అయినందుకుగాను వారికి కూడా నా అభినందనలు.

ఎస్ఎఎఆర్ సి (‘సార్క్’) కొత్త సెక్ర‌ట‌రి జ‌న‌ర‌ల్‌ సైతం ఈ రోజు న మన తో ఉన్నారు. ఆయన కు నేను స్వాగ‌తం ప‌లుకుతున్నాను. అలాగే గాంధీన‌గ‌ర్ నుండి సార్క్ విప‌త్తు నిర్వ‌హ‌ణ కేంద్రం సంచాలకులు కూడా మ‌న‌ తో ఉన్నారు.

ఎక్స్ లన్సీస్‌,

మ‌నంద‌రికీ తెలుసు.. కోవిడ్-19ని డ‌బ్ల్యు హెచ్‌ఒ ఇటీవ‌లే ప్రపంచ వ్యాప్త వ్యాధి గా ప్ర‌క‌టించింది.

ఇప్ప‌టివ‌ర‌కు, మ‌న ప్రాంతం లో కాస్త అటు ఇటు గా 150 కేసులు న‌మోదు అయ్యాయి. కానీ మ‌నం మ‌రింత అప్ర‌మ‌త్తం గా ఉండాలి.

మాన‌వాళి లో ఐదో వంతు నివసిస్తున్నది మన ప్రాంతం లోనే. జ‌న‌సాంద్ర‌త ఎక్కువ‌ ఉన్నటువంటి ప్రాంతం మ‌న‌ది.
ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల లభ్యత విషయం లో, అభివృద్ధి చెందుతున్న దేశాలు గా మన ముందు గణనీయమైన సవాళ్లు ఉన్నాయి. మ‌న ప్ర‌జ‌ల‌కు -ప్ర‌జ‌ల‌ కు మ‌ధ్య సంబంధాలు ఎంతో పురాతనమైనటువంటివి. అంతేకాదు, మ‌న స‌మాజాలు లోతైన అనుసంధాన‌మై ఉన్నాయి కూడాను. అందువల్ల, మనమంతా కలసి సంసిద్ధమై ఉండాలి. మనం అందరమూ కలసి పని చేయాలి, మనమందరం సమష్టి గా విజయవంతం అయితీరాలి.

ఎక్స్ లన్సీస్‌,

ఈ స‌వాలు ను ఎదుర్కోవ‌డానికి మ‌నం సంసిద్ధం గా ఉన్నాము. ఇప్ప‌టివ‌ర‌కు ఈ వైర‌స్ వ్యాప్తి ని ఎదుర్కోవ‌డం లో భార‌తదేశం యొక్క అనుభ‌వాన్ని గురించి మీకు వివ‌రిస్తాను.

”అప్ర‌మ‌త్తం గా ఉండండి, కానీ ఆందోళ‌న చెంద‌వ‌ద్దు” అన్న‌ది మాకు మార్గ‌నిర్దేశం గా నిలుస్తున్నటువంటి మంత్రం గా ఉంది. ఆలోచ‌న లేని హ‌డావుడి కాకుండా, స‌మ‌స్య‌ ను త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌కుండా మేము అప్ర‌మ‌త్తం గా ఉన్నాము. మేము గ్రేడెడ్ రెస్పాన్స్ మెకానిజమ్ తో పాటు సానుకూల చ‌ర్య‌ల ను తీసుకొనేందుకు ప్రయ‌త్నించాము.

జ‌న‌వ‌రి మ‌ధ్య‌ నుండే భార‌త‌దేశం లోకి వ‌చ్చే వారి ని ప‌రిశీలించ‌డం మొద‌లుపెట్టాము. ఆ త‌రువాత క్ర‌మం గా ప్ర‌యాణాల‌ పైన ఆంక్ష‌ల ను పెంచుతూ వ‌చ్చాము. ఇలా, అంచెలంచెలు గా తీసుకొంటూ వ‌చ్చిన చ‌ర్య‌ లు ప్ర‌జ‌లు ఆందోళ‌న చెంద‌కుండా చూశాయి. టెలివిజ‌న్‌, ముద్రణ మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల ద్వారా ప్ర‌జ‌ల‌ లో అవగాహ‌న ను క‌ల్పించే కార్య‌క్ర‌మాల ను మేము అధికం గా చేపట్టాము.

స‌హాయం అవ‌స‌ర‌మున్న వ‌ర్గాల‌ ను చేర‌డానికి మేము ప్ర‌త్యేకమైనటువంటి చ‌ర్య‌ల ను తీసుకొంటున్నాము.
దేశ‌వ్యాప్తం గా మా వైద్య‌ సిబ్బంది కి శిక్ష‌ణ‌ను ఇవ్వ‌డం తో పాటు మా వ్య‌వ‌స్థ యొక్క సామ‌ర్ధ్యాన్ని మ‌రింత‌ గా పెంచ‌డానికి మేము కృషి చేశాము. వైద్య ప‌రీక్ష‌ల సామ‌ర్ధ్యాల ను కూడా పెంచాము. రెండు నెలల్లో మేము దేశీయం గా ఉన్న ఒక ప్ర‌ధాన ప‌రీక్షా కేంద్రం నుండి అటువంటివి 60కి పైగా ప్రయోగ శాలల ను ఏర్పాటు చేసుకోగ‌లిగాము.

ఈ మ‌హ‌మ్మారి ని ప్ర‌తి ద‌శ లో అదుపు చేసేందుకు అవ‌స‌ర‌మైన ప్రొటోకాల్స్‌ ను మేము అభివృద్ధి పరచుకొన్నాము. దేశం లోకి ప్ర‌వేశించే మార్గాల వద్ద స్క్రీనింగ్‌, అనుమానిత వ్యక్తుల తో స‌న్నిహితం గా మెలగిన ఇతరుల ను గుర్తించ‌డం, క్వోరంటీన్‌, అనుమానిత వ్యక్తుల‌ ను ఏకాంత ప్ర‌దేశం లో ఉంచడం, వైర‌స్ బారి నుండి బ‌య‌ట‌ప‌డిన వారి ని డిశ్చార్జి చేయ‌డం వంటివి ఇందులో భాగం గా ఉన్నాయి.

విదేశాల‌ లోని మా ప్ర‌జ‌ల అభ్య‌ర్థ‌న‌ల‌ పట్ల కూడా మేము స్పందిస్తున్నాము. మేము వివిధ దేశాల‌ లో ఉన్న సుమారు 1400 మంది భార‌తీయుల‌ ను తరలించాము. అలాగే మీ మీ దేశాల‌ కు చెందిన కొంద‌రు పౌరుల కు కూడా ‘నైబ‌ర్‌హుడ్ ఫ‌స్ట్ పాల‌సీ’లో భాగం గా స‌హాయాన్ని అందించాము.

విదేశాల‌ లోని మా సంచార బృందాలు వారికి ప‌రీక్ష‌ల ను నిర్వ‌హించ‌డం తో పాటు, ఇలా విదేశాల‌ నుండి ఖాళీ చేయించడానికి సంబంధించి కూడా మేము ప్రొటోకాల్స్ ను రూపొందించాము.

భారతదేశం లోని ఇత‌ర దేశాల పౌరుల ను గురించి ఆయా దేశాలు ఆందోళ‌న చెందుతుంటాయ‌న్న విష‌యం కూడా మాకు తెలుసు. అందువ‌ల్ల మేం తీసుకొంటున్న చ‌ర్య‌ల ను గురించి విదేశీ రాయ‌బారుల‌ కు మేము వివ‌రించాము.

ఎక్స్ లన్సీస్‌,

ప‌రిస్థితులు ఎలా మారుతాయో ఇంకా ఏమీ తెలియ‌ని ప‌రిస్థితుల‌ లో ఉన్న విష‌యాన్ని మేం గుర్తించాం. ఎంత మంచి కృషి చేస్తున్న‌ప్ప‌టికీ, ప‌రిస్థితులు ఎలా మారుతాయో స్పష్టం గా ఊహించ‌లేని స్థితి లో ఉన్నాము. మీరు కూడా ఇటువంటి ప‌రిస్థితినే ఎదుర్కొంటూ ఉండ‌వ‌చ్చు. అందువ‌ల్ల మ‌నం మ‌న ఆలోచ‌న‌ల‌ ను పంచుకోవ‌డం ఎంతైనా విలువైన‌వి కాగ‌ల‌వు.

మీ అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాను.

మీకు ఇవే ధ‌న్య‌వాదాలు.

'మన్ కీ బాత్' కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడే పంచుకోండి!
Modi Govt's #7YearsOfSeva
Explore More
ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి  దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం

ప్రముఖ ప్రసంగాలు

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ 71వ స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి చేసిన ప్ర‌సంగ పాఠం
‘Reform-oriented’, ‘Friendly govt': What the 5 CEOs said after meeting PM Modi

Media Coverage

‘Reform-oriented’, ‘Friendly govt': What the 5 CEOs said after meeting PM Modi
...

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi holds fruitful talks with PM Yoshihide Suga of Japan
September 24, 2021
షేర్ చేయండి
 
Comments

Prime Minister Narendra Modi and PM Yoshihide Suga of Japan had a fruitful meeting in Washington DC. Both leaders held discussions on several issues including ways to give further impetus to trade and cultural ties.