నవ రాత్రులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యం విషయంలో స్వీయ ఆలోచనల్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు. దేవీ మాత ఆరాధనతో అపార శాంతీ, శక్తీ లభిస్తాయని స్పష్టం చేశారు. దేవిని స్తుతించే ఒక భక్తి గీతాన్ని శ్రీ మోదీ పంచుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘మా అంబే ఆరాధనతో భక్తిపూర్వక అద్భుత ఆనందాన్ని పొందవచ్చు. ఈ మార్గాన్ని అనుసరించడం వల్ల మనస్సుకు అంతులేని శాంతితో పాటు ఆత్మశక్తి కూడా లభిస్తుంద’’ని పేర్కొన్నారు.
मां अम्बे की आराधना से भक्ति का अद्भुत आनंद प्राप्त होता है। इससे मन को असीम शांति और आत्मिक शक्ति मिलती है।https://t.co/mqlVG5DTj1
— Narendra Modi (@narendramodi) March 23, 2026


