అనంత జ్ఞానాన్ని ఇతరులతో పంచుకున్నా, లేదా మరింతగా విస్తరించినా అది తరిగిపోదని, జ్ఞాన పరిపూర్ణత్వం ఎలాంటి లోటుకూ తావు ఇవ్వక యథాపూర్వంగా మిగులుతుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
జ్ఞాన భాండాగారంలో నుంచి విషయాలను నేర్చుకోవడం, దాంతో కొత్త ఫలితాల్ని ఆవిష్కరించడం లెక్కపెట్టలేనన్ని అవకాశాలతో పాటు నవ కల్పనలకు బాటను పరుస్తుందని, అదే సమయంలో జ్ఞాన మూలం యథా పూర్వం గా ఉంటుందని ఆయన అన్నారు.
శాశ్వత జ్ఞానాన్ని గురించి ఈశా ఉపనిషత్తులో ఉన్న ప్రస్తావనను ప్రధానమంత్రి ఉదాహరిస్తూ, సంస్కృత భాషలో ఉన్న ఈ కింది పవిత్ర శ్లోకాన్ని ప్రస్తావించారు..:
“పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే’’
पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते।
— Narendra Modi (@narendramodi) February 20, 2026
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥ pic.twitter.com/JqueNbycVb


