ఘనా జాతీయ పురస్కారం ‘ఆఫీసర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ ఆఫ్ ఘనా’ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఈ రోజు ప్రదానం చేశారు. ఆయన విశిష్ట రాజనీతిజ్ఞత‌కూ, ప్రపంచ స్థాయి నాయకత్వానికీ గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ఘనా అధ్యక్షుడు డాక్టర్ జాన్ డ్రమానీ మహామా అందజేశారు. ఈ అవార్డును 140 కోట్ల మంది భారతీయుల పక్షాన ప్రధానమంత్రి స్వీకరించారు. భారతదేశ యువత ఆకాంక్షలకూ, భారత్ సాంస్కృతిక సంప్రదాయాలతో పాటు భిన్నత్వానికీ, అలాగే ఘనాకూ, భారత్‌కూ మధ్య గల చరిత్రాత్మక సంబంధాలకూ ఈ పురస్కారాన్ని అంకితమిస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు.

 

 ఈ విశిష్ట సన్మానానికి గాను ఘనా ప్రజలకూ, ఘనా ప్రభుత్వానికీ ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. రెండు దేశాల ఉమ్మడి ప్రజాస్వామిక విలువలు, సంప్రదాయాలు ఈ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకుపోతూనే ఉంటాయని ఆయన అన్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మైత్రిని మరింత దృఢతరం చేయడంతో పాటు ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించాలన్న కొత్త బాధ్యతను తనకు అప్పగిస్తోందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఘనాలో తాను చేపట్టిన చరిత్రాత్మక పర్యటన భారత్-ఘనా సంబంధాలకు కొత్త వేగాన్ని అందిస్తుందన్న నమ్మకం తనకుందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ‌

 

Click here to read full text speech

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
From 17,000 Violent Incidents To Bastar Olympics: How PM Modi Got The Maoists To Turn In

Media Coverage

From 17,000 Violent Incidents To Bastar Olympics: How PM Modi Got The Maoists To Turn In
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 జూన్ 2026
June 23, 2026

Holistic Development under the Modi Government: Delivering Positive Transformation Across Every Sector