మహాయోధుడు మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఆయనకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నివాళులర్పించారు.

వీరత్వానికి, పరాక్రమానికి మహారాణా ప్రతాప్ అమర ప్రతీకగా నిలిచారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. మాతృభూమి గౌరవ మర్యాదలను, ప్రతిష్టను, ఆత్మ గౌరవాన్ని కాపాడటం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు.

మహారాణా ప్రతాప్‌ అజేయమైన ధైర్యం, చెక్కుచెదరని ఆత్మగౌరవ గాథలు యుగయుగాల వరకు దేశ ప్రజల హృదయాల్లో దేశభక్తి స్పూర్తిని నింపుతూనే ఉంటాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

"వీరత్వానికి, పరాక్రమానికి అమర చిహ్నం, దేశం గర్వించే గొప్ప యోధుడు మహారాణా ప్రతాప్ జయంతి సందర్భంగా ఆయనకు ఇవే నా గౌరవపూర్వక నివాళులు. మాతృభూమి గౌరవ మర్యాదలను, ప్రతిష్టను కాపాడటం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన అజేయమైన ధైర్యం, చెక్కుచెదరని ఆత్మగౌరవ గాథలు యుగయుగాల వరకు దేశ ప్రజల హృదయాల్లో దేశభక్తి జ్వాలను రగిలిస్తూనే ఉంటాయి.’’

 

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region

Media Coverage

Indian Railways takes up 764 km of new lines to boost connectivity in Bihar’s Seemanchal region
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
నిస్వార్థ సేవ భావనను బోధించే సంస్కృత సుభాషితాన్ని తెలియజేసిన ప్రధానమంత్రి
August 07, 2026

నిస్వార్థ సేవ గుణాన్ని, ఇతరుల వద్ద నుంచి మరేదీ ఆశించకుండా వారి మేలు కోసం పని చేయాలనే గొప్ప ఆదర్శాన్ని బోధిస్తున్న సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.

‘‘కిం చంద్రమాః ప్రత్యుపకారలిప్సయా కరోతి గోభిః కుముదావబోధనమ్

స్వభావ ఏవోన్నతచేతసాం సతాం పరోపకారవ్యసనం హి జీవితమ్’’

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘కిం చంద్రమాః ప్రత్యుపకారలిప్సయా కరోతి గోభిః కుముదావబోధనమ్

స్వభావ ఏవోన్నతచేతసాం సతాం పరోపకారవ్యసనం హి జీవితమ్’ అని పేర్కొన్నారు.