ప్రముఖ సామాజికవేత్త, మేధావి డాక్టర్ రామ్ మనోహర్ లోహియా జయంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు.
డాక్టర్ లోహియా బహుముఖీన వ్యక్తిత్వం కల వారని శ్రీ మోదీ ప్రశంసించారు. వలసవాదానికి వ్యతిరేకంగా ప్రజల్ని కూడగట్టడంలోనూ, 1947 తరువాతి కాలంలో భారత్ పురోగతికి తోడ్పడడంలోనూ ఆయన కీలక పాత్రను పోషించారని శ్రీ మోదీ అన్నారు. డాక్టర్ లోహియా అసాధారణ మేధావి అనీ, దేశంలో సామాజిక న్యాయానికి అనుకూలంగా తమ వాణిని బిగ్గరగా వినిపించిన అగ్రగణ్యులలో ఒకరనీ ప్రధాని వ్యాఖ్యానించారు. పేదలకీ, నిరాదరణకు గురైన వారికీ సాధికారితను కల్పించాలన్న డాక్టర్ లోహియా నిబద్ధత తిరుగులేనిదనీ, అది నిరంతరం స్ఫూర్తిదాయకమనీ శ్రీ మోదీ స్పష్టం చేశారు. స్త్రీపురుష సమానత్వం విషయంలో, ప్రాతినిధ్య పూర్వక పాలన అంశంలో ఆయన నాడు చేసిన ఆలోచనలకు ఈనాటికీ అంతే సందర్భశుద్ధి ఉందని ప్రధాని అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో  ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారికి ఆయన జయంతి సందర్భంగా నివాళులు. బహుముఖీన వ్యక్తిత్వం సొంతమైన ఆయన.. వలసవాద పాలనకు వ్యతిరేకంగా ప్రజలను ఉద్యమింపచేయడంలో, 1947 తరువాతి కాలంలో భారత్ పురోగతికి తోడ్పాటును అందించడంలో ఓ కీలక పాత్రను పోషించారు. ఆయన ఓ అసాధారణ ఆలోచనాపరుడు. సామాజిక న్యాయాన్ని సాధించాలని మున్ముందుగా బలంగా వాదించిన వారిలో ఒకరు. పేదలకీ, సమాజంలో ఆదరణకు నోచుకోని వర్గాల వారికీ సాధికారితను కల్పించడం పట్ల ఆయన కనబరిచిన తిరుగులేని నిబద్ధత తరాల తరబడి స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుంది. లైంగిక సమానత్వం, ప్రాతినిధ్యపూర్వక పాలన.. ఈ విషయాల్లో ఆయన ఆలోచనలు కూడా సమాన స్థాయిలో గుర్తుంచుకోదగ్గవి’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Government's foodgrain stocks hit 604 lakh tonnes, nearly three times buffer requirement

Media Coverage

Government's foodgrain stocks hit 604 lakh tonnes, nearly three times buffer requirement
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 మే 2026
May 07, 2026

Justice Delivered Under PM Modi: How Operation Sindoor Redefined India’s Response to Terror

Aatmanirbhar Bharat in Action: Record Exports, Defence Exports, Food Security & Green Mobility Under the Leadership of PM Modi