ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌తో కలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పారిస్‌లో జరిగిన ఐరోపాలోనే అతిపెద్ద సాంకేతిక, అంకురాల కార్యక్రమం అయిన 'వివాటెక్ 2026'లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సాంకేతిక వ్యవస్థాపకులు, అంకురాలు, పెట్టుబడిదారులు, వ్యాపార ప్రముఖుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడారు. మానవాళి శ్రేయస్సే కేంద్రంగా సాగే కృత్రిమ మేధ, అధునాతన సాంకేతికతలపై భారతదేశ దార్శనికతను, సరికొత్త సాంకేతిక రంగాలలో భారత్-ఫ్రాన్స్ మధ్య విస్తరిస్తున్న సహకారాన్ని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. డిజిటల్ చెల్లింపులు, వ్యవసాయ రంగంలో ఏఐ ఆధారిత పురోగతి నుంచి అత్యాధునిక అంతరిక్ష ప్రయోగాల వరకు సాంకేతికత అనేది భారతదేశంలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. తదనంతరం పారిశ్రామిక రంగం, ఆరోగ్య సంరక్షణ, సుస్థిరత, మొబిలిటీ రంగాలలో అత్యాధునిక సాంకేతికతలను, ఆచరణాత్మక పరిష్కారాలను అందిస్తోన్న భారతీయ అంకురాలు, ఆవిష్కర్తలతో ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షుడు మెక్రాన్ మాట్లాడారు.

‘వివాటెక్ 2026’లో భారతదేశం ‘కృత్రిమ మేధకు సంబంధించిన భాగస్వామ్య దేశం’గా వ్యవహరిస్తోంది. వివాటెక్ చరిత్రలోనే భారతదేశం ఇంతటి భారీ స్థాయిలో ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి. కృత్రిమ మేధ, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, వైద్యారోగ్య సాంకేతికత, హరిత సాంకేతికతలు, మొబిలిటీ, అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో దేశీయ ఆవిష్కరణల వ్యవస్థను ప్రదర్శించే ప్రత్యేక పెవిలియన్లను ఏర్పాటు చేశారు. భారతదేశానికి చెందిన 80కి పైగా డీప్-టెక్ కంపెనీలు, అంకురాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. 

ఈ సదస్సులో ప్రధానమంత్రి పాల్గొనడం ద్వారా భారత్-ఫ్రాన్స్ సాంకేతిక వ్యవస్థల మధ్య భాగస్వామ్యం మరింత బలోపేతం కానుంది. గత కొన్ని సంవత్సరాలుగా వివాటెక్‌తో భారత్‌కు ఉన్న అనుబంధం నిరంతరం పెరుగుతూ వస్తోంది. 2021లో జరిగిన వివాటెక్ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కీలకోపన్యాసం చేయగా.. 2022లో వివాటెక్ చరిత్రలోనే మొట్టమొదటి 'కంట్రీ ఆఫ్ ది ఇయర్' గౌరవాన్ని భారత్ దక్కించుకుంది. ఇటీవల వివాటెక్ సంస్థ బెంగళూరు సాంకేతిక సదస్సుతో అధికారిక భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇరు దేశాలు 2026 సంవత్సరాన్ని 'భారత్-ఫ్రాన్స్ ఆవిష్కరణల ఏడాది'గా జరుపుకుంటున్న నేపథ్యంలో ఈ ఏడాది వివాటెక్‌లో భారత్‌ భాగస్వామ్యం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది.

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation

Media Coverage

Vikas Bhi, Virasat Bhi: How JATAN, AI and Digital Archives are revolutionising India’s cultural heritage preservation
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న యోధులకు ప్రధాని నివాళి
August 09, 2026

చరిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న యోధులందరినీ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో వారు చూపిన ధైర్యసాహసాలకూ, దృఢ సంకల్పానికీ నివాళి అర్పించారు. మహాత్మాగాంధీ నాయకత్వం అందించిన స్ఫూర్తితో క్విట్ ఇండియా ఉద్యమం ఇచ్చిన పిలుపు స్వాతంత్ర్య పోరాటంలో నూతనోత్తేజాన్ని నింపిందనీ, వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న భారత ప్రజల అచంచలమైన సంకల్పాన్ని ప్రతిబింబించిందని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి పోస్టు:

చరిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న వారిని స్మరించుకుంటున్నా. వారి ధైర్యం ప్రతి భారతీయునికీ ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకం. మహాత్మాగాంధీ నాయకత్వం అందించిన స్ఫూర్తితో క్విట్ ఇండియా పిలుపు స్వాతంత్ర్య ఉద్యమంలో నూతన శక్తిని నింపింది. వలస పాలన నుంచి విముక్తి పొందాలన్న మన ప్రజల అచంచల సంకల్పాన్ని ప్రతిబింబించింది.