‘‘లబ్ధిదారులుప్రభుత్వం చుట్టూ తిరగనక్కరలేదు. దానికి బదులుగా ప్రభుత్వమే లబ్ధిదారులచెంతకు చేరుకొని తీరాలి’’
‘‘వికసిత్ భారత్సంకల్ప్ యాత్ర అనేది నాకు ఒక పరీక్ష. ప్రజలు ఆశించిన ఫలితాలు వచ్చాయా అన్నది వారి వద్ద నుండే నేను తెలుసుకో దలచాను’’
‘‘సఫలమైన పథకాలుపౌరుల లో స్వామిత్వ భావన ను కలుగజేస్తాయి’’
‘‘వికసిత్ భారత్తాలూకు విత్తనాల ను చల్లడం జరిగిందా అంటే, రాబోయే 25 సంవత్సరాల లో తత్ఫలితాన్ని మన భావి తరాలు అందుకొంటాయి’’
‘‘అన్ని ఇబ్బందులను వదలించుకొనేటందుకు వికసిత్ భారత్ ఒక మార్గం’’

‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో ఈ రోజు న జరుగగా, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆ కార్యక్రమం లో పాలుపంచుకొన్నారు. ఈ సందర్భం లో ఏర్పాటైన స్టాల్స్ ను, వికసిత్ భారత్ యాత్ర వ్యాను ను మరియు తత్సంబంధి క్విజ్ కార్యక్రమాన్ని శ్రీ నరేంద్ర మోదీ పరిశీలించారు. ప్రభుత్వ వివిధ పథకాల లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి భేటీ కావడం తో పాటు వారి ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో భాగం గా ‘వికసిత్ భారత్ సంకల్ప్ సంబంధఇ ప్రమాణ పాఠాన్ని సభికుల చేత స్వీకరింపచేయడమైంది.

 

జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, దేశ వ్యాప్తం గా పార్లమెంటు సభ్యులు అందరు వారి వారి నియోజక వర్గాల లో ‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర’ లో పాలుపంచుకొంటున్న సంగతి ని ప్రస్తావించారు. తాను పార్లమెంటు సభ్యుని గాను, నగర ‘సేవకుని’ గాను వారాణసీ లో వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర (విబిఎస్‌వై) లో పాల్గొంటున్నట్లు గా ఆయన చెప్పారు. ప్రభుత్వ పథకాలు వాటి లబ్ధిదారుల కు కాల బద్ధమైన రీతి న ఎటువంటి అంతరాయాని కి తావు లేకుండా అందేటట్లు జాగ్రత తీసుకోవలసిన అవసరాన్ని గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నొక్కి పలికారు. ‘‘లబ్ధిదారులు ప్రభుత్వం చుట్టూ తిరగ వలసిన అగత్యం లేదు. ప్రభుత్వం లబ్ధిదారుల చెంతకు చేరుకోవలసిందే’’ అని ఆయన అన్నారు. పిఎమ్ఎవై లో భాగం గా, 4 కోట్ల కుటుంబాల కు పక్కా ఇళ్ళ ను అప్పగించడమైంది’’ అని శ్రీ నరేంద్ర మోదీ తెలియ జేశారు. ఏ పథకం అయినా ఆ పథకం రూపొందించిన లక్షిత వర్గాల కు పూర్తిగా చేరుకోవాలి, ఇంతవరకు పట్టించుకోని అటువంటి ప్రజల ను కలుపుకొని పోవాలి అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర నాకు ఒక పరీక్ష గా ఉంది’’ అని ప్రధాన మంత్ర అన్నారు. ఆశించిన ఫలితాలు అందాయా అనేది ప్రజల వద్ద నుండి నేను తెలుసుకో గోరుతున్నాను అని ఆయన అన్నారు. కొద్ది సేపటి క్రితం లబ్ధిదారులలో కొందరి తో తాను భేటీ అయిన సంగతి ని ఆయన గుర్తు కు తీసుకు వస్తూ, ఆయుష్మాన్ భారత్ మరియు ఆయుష్మాన్ కార్డ్ ల వంటి పథకాల తాలూకు లాభాల ను గురించి ప్రస్తావించారు. ప్రభుత్వ పథకాల ను క్షేత్ర స్థాయి లో అమలుపరుస్తున్న అధికారుల సకారాత్మక కార్యాల ప్రభావాన్ని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, అది వారికి ఉత్సాహం మరియు తృప్తి ల నూతన భావనల ను కలుగజేస్తోందన్నారు. ‘‘కార్యక్షేత్రం లో ప్రభుత్వ పథకాల అమలు తాలూకు ప్రభావం ప్రభుత్వ ఉద్యోగుల లో సంతోషం యొక్క ఒక కొత్త పార్శ్వాన్ని బయటపెడుతుంది, వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర ద్వారా దీనిని సాధ్యమయ్యేటట్టు గా చేయడం జరుగుతున్నది’’ అని ప్రధాన మంత్రి అన్నారు.


ప్రధాన మంత్రి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఈ పథకాల ప్రభావాన్ని స్వయం గా తెలుసుకోవడం యొక్క పరివర్తన పూర్వకమైన శక్తి ని గురించి చెప్పసాగారు. ఈ పథకాలు వంట ఇళ్ళ లో ఎగసే పొగ ను పారద్రోలుతున్నాయి. పక్కా ఇళ్ళు ఒక క్రొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్నాయి పేద లు వారు సశక్తం అవుతున్నామన్న భావన కు లోనవుతున్నారు. మరి కలవారు లేనివారు అనే తేడాలు తగ్గుతూ పోతున్నాయి ఇవన్నీ గొప్ప సంతృప్తి ని ఇస్తున్నాయి అన్నారు.

సఫలం అయినటువంటి పథకాలు పౌరుల లో స్వామిత్వ తరహా భావన ను రేకెత్తిస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. రుణాన్ని మరియు ఇతర సదుపాయాల ను అందుకొన్న వ్యక్తి ఇది అతడి దేశం, అతడి కి చెందిన రైల్ వే లు, అతడి కి చెందిన కార్యాలయం, అతడి కి చెందిన ఆసుపత్రి అని భావిస్తాడు. ఈ తరహా స్వామిత్వ భావన ఎప్పుడైతే కలుగుతుందో, దేశం కోసం ఏదైనా చేయాలి అనేటటువంటి కోరిక కూడా ఉదయిస్తుంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ఇది రాబోయే తరాల కోసం ఒక మెరుగైన భవిష్యత్తు ను ఆవిష్కరించడం పట్ల ప్రజల లో విశ్వాసాన్ని నింపుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ఒక స్వతంత్ర భారతదేశాన్ని ఆవిష్కరించాలి అనే ఉమ్మడి లక్ష్యాన్ని చేరుకోవడం కోసమే స్వాతంత్య్రం సాధన కు పూర్వ కాలం లో దేశం లో ప్రతి ఒక్క పని ని మొదలు పెట్టడం జరిగిన విషయాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు కు తీసుకు వచ్చారు. ‘‘ప్రతి ్క పౌరుడు, ప్రతి ్క పౌరురాలు వారివైన పద్ధతుల లో స్వాతంత్య్రం సాధన కై తోడ్పాటు ను అందించారు.’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ వాతావరణం ఏకత్వాన్ని నెలకొల్పి, చివర కు బ్రిటిషు వారు భారతదేశాన్ని వీడిపోయేటట్లు గా చేసింది అని ఆయన అన్నారు. వికసిత్ బారత్ సంకల్పాన్ని నెరవేర్చడం కోసం అదే తరహా దృష్టి ని కలిగి ఉండాలి అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు. ప్రతి ్క వ్యక్తి ని గౌరవిస్తూ, దేశాన్ని ముందుకు తీసుకు పోవాలి అని ఆయన నొక్కి చెప్పారు. ‘‘వికసిత్ భారత్ తాలూకు విత్తుల ను చల్లడం జరిగిందా అంటే, రాబోయే 25 సంవత్సరాల యొక్క ఫలితాన్ని మన భావి తరాల వారు అందుకొంటారు’’ అని ఆయన అన్నారు. ‘‘భారతదేశం లో ప్రతి ్కరి కి ఈ మనస్తత్వం మరియు ఇటువంటి సంకల్పం అవసరం’’ అని ఆయన అన్నారు.

 

వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర అనేది దేశ ప్రజల పరిశ్రమ, అది ఏ రాజకీయ పక్షం యొక్క కార్యమో కాదు, ఒక పవిత్ర బాధ్యత. ప్రజలు దీనిలో ప్రత్యక్షం గా పాల్గొనాలి అని అని ప్రధాన మంత్రి అన్నారు. ‘‘ఎవరైనా దీనిని గురించి వార్త పత్రికల లో చదివినంతనే సంతృప్తి చెందారు అంటే, ఆ వ్యక్తి ముఖ్యమైనటువంటి దేని లోనో పాల్గొనలేకపోతున్నట్లే’’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ యాత్ర తాలూకు వేరు వేరు దశల లో పాలుపంచుకో గలుగుతున్నందుకు ఆయన స్వీయ సంతృప్తి ని కూడ వ్యక్తం చేశారు.

 

‘‘సకాతాత్మక వైఖరి సకారాత్మకమైన వాతావరణానికి దారి తీస్తుంది అంటూ, యాత్ర ను గురించి చురుకు గా ప్రయాచం చేయండని ప్రధాన మంత్రి లబ్ధిదారుల కు మరియు పౌరుల కు సూచించారు. విబిఎస్‌వై అనేది ఒక విశాల సంకల్పం అని ప్రధాన మంత్రి అభివర్ణిస్తూ, దీనిని ‘సబ్ కా ప్రయాస్’ (‘అందరి ప్రయత్నాల’) ద్వారా సాకారం చేయాలి అని ప్రధాన మంత్రి ఉద్భోదించారు. ఆర్థికం గా బలమైన వికసిత్ భారత్ రూపుదాల్చినట్లయితే, అది దేశ పౌరుల సమస్య లు అన్నిటిని తీర్చ గలుగుతుంది అని చెప్తూ, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. ‘‘అన్ని ఇక్కట్టుల ను పారద్రోలేటటువంటి బాట ‘వికసిత్ బారత్’ సంబంధి సంకల్పం ద్వారానే ప్రయాణిస్తుంది. కాశీ ప్రజల కు నేను ఇస్తున్న హామీ ఏమిటి అంటే, అది మీ యొక్క ప్రతినిధి గా, మీరు అప్పజెప్పినటువంటి జాతీయ బాధ్యత ను నెరవేర్చడానికి ఎటువంటి ప్రయాసల ను నేను వదులుకోను.’’ అని ప్రధాన మంత్రి అన్నారు.

 

ప్రధాన మంత్రి తో పాటు ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ కూడ ఈ కార్యక్రమం లో పాల్గొన్నారు.

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Nepal praises India's efforts in times of crisis; calls PM Modi 'exceptionally generous'

Media Coverage

Nepal praises India's efforts in times of crisis; calls PM Modi 'exceptionally generous'
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 30 ఆగష్టు 2026
August 30, 2026

Tiranga in Tashkent, Relief in Nepal: Soft Power Meets First Responder

Vocal for Local, Nari Shakti, Real Heroes: Mann Ki Baat’s Atmanirbhar Hour