ఈ రోజు పవిత్ర ప్రకాశ్ పర్వ్.. ఈ సందర్భంగా, శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ కి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గౌరవ ప్రపత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘పవిత్రమైన ప్రకాశ్ పూరబ్ సందర్భంగా శ్రీ గురు తేగ్ బహాదుర్ జీ కి గౌరవపూర్వక శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాను. మన నాగరికతలో ఆయన ఓ శిఖరాయమాన ఆధ్యాత్మిక గరిష్ఠుడు. నిర్భయత్వానికీ, త్యాగానికీ, మానవాళి పట్ల తీవ్ర అనుకంపకూ ఆయన జీవితం ఒక ఉజ్వల ఉదాహరణ. అత్యంత ప్రతికూల పరిస్థితిలోనూ సత్యాన్నీ, ఆత్మాభిమానాన్నీ, నమ్మకాన్నీ నిలబెట్టడానికి కావలసిన దృఢ చిత్తాన్ని ఆయన చాటారు. ఆయన అందించిన శాశ్వత సందేశం అందరికీ సమానావకాశాలు దొరికే, దయామయ, సద్భావన సహిత సమాజాన్ని నిర్మించడంలో మనకు మార్గదర్శకంగా నిలవాలని నేను ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
On the sacred occasion of the Parkash Purab of Sri Guru Tegh Bahadur Ji, I offer my respectful homage to a towering spiritual great of our civilisation. His life was a radiant example of fearlessness, sacrifice and deep concern for humanity. He stood firm in defence of truth,…
— Narendra Modi (@narendramodi) April 7, 2026
ਸ਼੍ਰੀ ਗੁਰੂ ਤੇਗ਼ ਬਹਾਦਰ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੇ ਪਵਿੱਤਰ ਦਿਹਾੜੇ 'ਤੇ, ਮੈਂ ਸਾਡੀ ਸਭਿਅਤਾ ਦੀ ਇੱਕ ਮਹਾਨ ਅਧਿਆਤਮਿਕ ਸ਼ਖ਼ਸੀਅਤ ਨੂੰ ਸਤਿਕਾਰ ਸਹਿਤ ਸ਼ਰਧਾਂਜਲੀ ਭੇਟ ਕਰਦਾ ਹਾਂ। ਉਨ੍ਹਾਂ ਦਾ ਜੀਵਨ ਨਿਡਰਤਾ, ਕੁਰਬਾਨੀ ਅਤੇ ਮਨੁੱਖਤਾ ਪ੍ਰਤੀ ਡੂੰਘੀ ਚਿੰਤਾ ਦੀ ਇੱਕ ਰੋਸ਼ਨ ਮਿਸਾਲ ਹੈ। ਉਹ ਬੇਅੰਤ ਮੁਸੀਬਤਾਂ ਦੇ ਬਾਵਜੂਦ ਸੱਚ, ਮਾਣ-ਸਨਮਾਨ ਅਤੇ…
— Narendra Modi (@narendramodi) April 7, 2026


