బ్రెజిల్ లోని  రియో డి జెనీరోలో జరుగుతున్న 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో మలేషియా ప్రధాని గౌరవ అన్వర్ బిన్ ఇబ్రహీంతో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
 

 

మలేషియా ప్రధాని 2024 ఆగస్టులో భారత్ ను సందర్శించిన అనంతరం రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల్లో సాధించిన పురోగతిని నాయకులు సమీక్షించారు. వీటిలో వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ రంగం, విద్య, ఆరోగ్యం, పర్యాటకం, ప్రజల మధ్య సంబంధాలు సహా వివిధ అంశాలు ఉన్నాయి.
 

పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన ప్రధాని ఇబ్రహీంకు ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు. బహుపాక్షిక రంగాలు, ప్రాంతీయ భద్రతలో సహకారంపై ఇద్దరు నాయకులు చర్చించారు.
 

ఆసియాన్‌కు విజయవంతంగా నాయకత్వం వహించిన మలేషియాకు ప్రధాని శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఆసియాన్-ఇండియా ఎఫ్‌టీఏ సమీక్షను తక్కువ సమయంలో, విజయవంతంగా పూర్తిచేయడంతో సహా ఆసియాన్-ఇండియా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అందిస్తున్న మద్దతును స్వాగతించారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Inspiration For Millions': PM Modi Gifts Putin Russian Edition Of Bhagavad Gita

Media Coverage

'Inspiration For Millions': PM Modi Gifts Putin Russian Edition Of Bhagavad Gita
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ప్రధాని మోదీ మన్ కి బాత్ కోసం మీ ఆలోచనలు, సలహాలను పంచుకోండి
December 05, 2025
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం డిసెంబ‌ర్ 28 ఆదివారం నాడు తన 'మన్ కి బాత్' (మనసులో మాట)ను పంచుకుంటారు. మీరు వినూత్న సలహాలను మరియు అంతర్దృష్టులను కలిగి ఉంటే, ఇక్కడ నేరుగా ప్రధాని తో పంచుకునే అవకాశం ఉంది. కొన్ని సలహాలను ప్రధాని ఆయన ప్రసంగంలో ప్రస్తావిస్తారు.

దిగువ వ్యాఖ్యల విభాగంలో మీ ఇన్పుట్లను పంచుకోండి.