జి 20 సమావేశానికి ఇండియా ఆహ్వానించిన 9 అతిథి దేశాలలో బంగ్లాదేశ్ ఒకటి.
ఇరువురు నాయకులు పరస్పర ఆసక్తి కలిగిన అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై చర్చించారు.
ఇరుదేశాలమధ్య రాజకీయ, భద్రత, ఆర్థిక, అనుసంధానత, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాల వంటి సానుకూల ద్వైపాక్షిక అంశాల పురోగతి స్థాయిని అంచనా వేశారు.
డిజిటల్ చెల్లింపులు, సాంస్కృతిక, వ్యవసాయ రంగాలలలో సహకారానికి సంబంధింఇ కుదిరిన 3 ఒప్పందాలను వారు స్వాగతించారు.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ . హసీనాను కలుసుకున్నారు. బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా , 2023 సెప్టెంబర్ 9–10 తేదీలలో న్యూఢిల్లీలో జరగనున్న జి 20 శిఖరాగ్ర సమ్మేళనానికి
అతిథి గా హాజరవుతున్నారు. ఇరువురు నాయకులు, రాజకీయ, భద్రతాపరమైన అంశాలతో పాటు సరిహద్దు నిర్వహణ, వాణిజ్యం, అనుసంధానత, జలవనరులు, విద్యుత్,ఇంధనం,అభివృద్ధిలో సహకారం,సాంస్కృతిక , ప్రజలకు – ప్రజలకు మధ్య సంబంధాలు వంటి వాటి విషయంలో
ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించిన అన్ని అంశాలను చర్చించారు. ఈ ప్రాంతంలో ప్రస్తుత పరిణామాలు, బహుళపక్ష వేదికలపై సహకారం వంటి అంశాలను కూడా ఉభయులు చర్చించారు.


చట్టోగ్రామ్, మోంగ్లా పోర్టుల వినియోగం. ,మోంగ్లా పోర్టులు,ఇండియా –బంగ్లాదేశ్ స్నేహపూర్వక  గొట్టపు మార్గం కార్యరూపం దాల్చడానికి సంబంధించిన ఒప్పందాలను ఉభయ నాయకులు స్వాగతించారు.
ద్వైపాక్షిక వాణిజ్యం రూపాయలలో పరిష్కరించుకోవడం కార్యరూపం దాల్చడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేశారు, ఈ ఏర్పాటును ఇరుదేశాలలోని వ్యాపార వర్గాలు సద్వినియోగం చేసుకోవడాన్ని
ప్రోత్సహించాలని నిర్ణయించారు.
 సరకుల వాణిజ్యం, సేవలు, పెట్టుబడుల సంరక్షణ, ప్రోత్సాహానికి సంబంధించి      సమగ్ర ఆర్ధిక భాగస్వామ్య ఒప్పందం (సిఇపిఎ) విషయంలో సంప్రదింపులు ప్రారంభం కాగలవని ఆకాంక్షించారు.

అభివృద్ధి సహకార ప్రాజెక్టుల అమలు విషయంలో ఉభయనాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉభయులకూ అనుకూలమైన తేదీలలో తదుపర ఈ కింది ప్రాజెక్టులు సంయుక్తంగా ప్రారంభించగలమన్న ఆకాంక్షను వారు వ్యక్తం చేశారు.
1. అగర్తల – అఖౌరా రైల్ లింక్
2. మైత్రి పవర్ ప్లాంట్ యూనిట్ –2

3.ఖుల్నా– మోంగ్లా రైల్ లింక్

ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేసేందుకు కింది అవగాహనా ఒప్పందాలను ఇచ్చిపుచ్చుకోవడాన్ని వారు స్వాగతించారు.
1. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్.పి.సి.ఐ), బంగ్లాదేశ్ బ్యాంక్ మధ్య డిజిటల్ చెల్లింపుల విధానాలకు సంబంధించి కింది అవగాహనా ఒప్పందాలను వారు స్వాగతించారు
2.ఇండియా – బంగ్లాదేశ్ లమధ్య 2023–2025 సంవత్సరాల మద్య సాంస్కృతిక మార్పిడి కార్యక్రమం (సిఇపి) పునరుద్ధరణకు సంబంధించిన అవగాహనా ఒప్పందాన్ని,
3. ఇండియా కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రిసెర్చి (ఐసిఎఆర్), బంగ్లాదేశ్ అగ్రికల్చరల్ రిసెర్చ్ కౌన్సిల్ (బిఎఆర్సి) మధ్య అవగాహనా ఒప్పందాన్ని స్వాగతించారు.


ప్రాంతీయ పరిణామాల విషయం ప్రస్తావిస్తూ   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, మయన్మార్ లోని రఖినే స్టేట్ నుంచి నిరాశ్రయులైన పదిలక్షలమంది కి ఆతిథ్యం ఇచ్చే బాధ్యతను బంగ్లాదేశ్ మోసినందుకు , బంగ్లాదేశ్ ను అభినందించారు.
శరణార్థులను సురక్షితంగా , నిరంతరాయంగా తిప్పి పంపేందుకు తగిన పరిష్కారం దిశగా, ఇండియా సానుకూల నిర్మాణాత్మక వైఖరిని ప్రధానమంత్రి తెలియజేశారు.
బంగ్లాదేశ్ ఇటీవల ప్రకటించిన ఇండో–పసిఫిక్ దార్శనికతను ఇండియా స్వాగతించింది.
వివిధ అంశాలపై , తమ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను   మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఉభయ నాయకులు అంగీకరించారు.
భారత ప్రభుత్వం, భారత ప్రజలు తమకు అందించిన ఆతిథ్యానికి బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా , ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

అన్ని స్థాయిలలో సంప్రదింపులను మరింత ముందుకు తీసుకెళ్లగలమన్న ఆకాంక్షను ఇరువురు నాయకులు వ్యక్తం చేశారు. 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
ISRO achieves milestone with successful sea-level test of CE20 cryogenic engine

Media Coverage

ISRO achieves milestone with successful sea-level test of CE20 cryogenic engine
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 13 డిసెంబర్ 2024
December 13, 2024

Milestones of Progress: Appreciation for PM Modi’s Achievements