2023లో జరిగిన జీ 20 సదస్సు, దానికి భారత్ అధ్యక్షత వహించడం గురించి పుస్తకం రాసేందుకు శ్రీ అమితాబ్ కాంత్ చేసిన కృషిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రశంసించారు. మానవాళికి ఈ భూమండలం మరింత ప్రయోజనాన్ని చేకూర్చేలన్న ఉద్దేశంతో భారత్ చేస్తున్న ప్రయత్నాలను ఈ పుస్తకంలో స్పష్టంగా తెలియజేశారని శ్రీ అమితాబ్ కాంత్ ను ప్రధాని కొనియాడారు.
శ్రీ అమితాబ్ కాంత్ ఎక్స్ లో చేసిన పోస్టుపై శ్రీ మోదీ స్పందిస్తూ:
‘‘2023లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశం, దానికి భారత్ అధ్యక్షత వహించడం గురించి రాసేందుకు మీరు చేసిన కృషి అభినందనీయం, ఈ భూమండలం వల్ల మానవాళి మరింత ప్రయోజనం పొందేలా భారత్ చేస్తున్న యత్నాలను ఈ పుస్తకంలో స్పష్టంగా తెలియజేశారు @amitabhk87’’
Your effort to write about India’s G20 Presidency and the Summit in 2023 is commendable, giving a lucid perspective on our efforts to further human-centric development in pursuit of a better planet.@amitabhk87 https://t.co/S4nAIaHlTD
— Narendra Modi (@narendramodi) January 21, 2025