మణిపూర్ లోని తమెంగ్ లాంగ్ జిల్లాలో గల రాణి గైడిన్లియు రైల్వేస్టేషన్‌కు తొలి సరకు రవాణా రైలు చేరుకోవడం పట్ల ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు. దీనితో మణిపూర్ తో అనుసంధానత మరింత పెరుగుతుందని, వాణిజ్యం దూసుకుపోతుందన్నారు.
ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పంపిన ట్విట్టర్ సందేశానికి బదులిస్తూ ప్రధానమంత్రి,
ఈశాన్య రాష్ట్రాల పరివర్తన కొనసాగుతుంది. మణిపూర్ తో అనుసంధానం మరింత పెరుగుతుంది. వాణిజ్యం దూసుకుపోతుంది. మణిపూర్ కు చెందిన అద్భుత ఉత్పత్తులు ఇక ఆ రాష్ట్రం నుంచి దేశమంతటికీ చేరుకుంటాయి అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.


