‘‘పోర్ట్ బ్లేయర్ లో నూతన టర్మినల్ భవనం ప్రయాణ సౌలభ్యాన్ని, వ్యాపార సంబంధి సౌలభ్యాన్ని మరియు కనెక్టివిటీ ని పెంచుతుంది’’
‘‘భారతదేశం లో చాలాకాలంపాటు అభివృద్ధి యొక్క లక్ష్యం పెద్ద నగరాల కు పరిమితం అయింది’’
‘‘సమ్మిళిత అభివృద్ధి తాలూకు ఒక క్రొత్త నమూనా భారతదేశం లో తెర ముందుకు వచ్చింది. ఆ నమూనా ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ ’’
‘‘అభివృద్ధి మరియువారసత్వం చట్టపట్టాల్ వేసుకొన్న ఒక మహా మంత్రం తాలూకు సజీవమైనటువంటి మరియుస్పందనాత్మకమైనటువంటి ఉదాహరణ గా అండమాన్ మారుతున్నది’’
‘‘అండమాన్ మరియు నికోబార్ దీవుల అభివృద్ధి దేశ యువత కు ఒక ప్రేరణాత్మకమైన ఆధారం గా మారింది’’
‘‘అభివృద్ధి అనేదిఅన్ని రకాల పరిష్కారాల తో మన ముందుకు వస్తుంది’’
‘‘ప్రపంచం లో ప్రస్తుతం అపూర్వమైన ప్రగతి ని సాధించిన దీవులు మరియు కోస్తా తీర ప్రాంత చిన్న దేశాల తాలూకు ఉదాహరణ లు అనేకం ఉన్నాయి’’

పోర్ట్ బ్లేయ‌ర్ లోని వీర్ సావర్ కర్ అంతర్జాతీయ విమానాశ్రయం లో నూతనం గా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ టర్మినల్ బిల్డింగు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్సింగ్ మాధ్యం ద్వారా ప్రారంభించారు. సుమారు 710 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం కలిగిన నూతన టర్మినల్ భవనం ప్రతి ఏటా దాదాపు గా 50 లక్షల మంది ప్రయాణికుల రాక పోకల కు అనువు గా రూపుదిద్దుకొన్నది.

సభ ను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు న జరుగుతున్న కార్యక్రమం పోర్ట్ బ్లేయ‌ర్ లో అవుతున్నప్పటికీ కూడా ను యావత్తు దేశ ప్రజలు ఈ కేంద్ర పాలిత ప్రాంతానికేసి ఆసక్తి గా చూస్తున్నారని పేర్కొన్నారు. దీనికి కారణం వీర్ సావర్ కర్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికుల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచాలన్న డిమాండు నెరవేరుతుండడమే. ఈ కార్యక్రమం లో పాలుపంచుకోవాలన్న కోరిక తనలోనూ ఉందని ప్రధాన మంత్రి అన్నారు. దీనికి కారణం పౌరుల ముఖాల లో సంతోషాన్ని, ఉల్లాసభరితమైన వాతావరణాన్ని తాను సైతం స్వయం గా అనుభూతి చెందగలిగే వాడి ని కదా అని ఆయన అన్నారు. ‘‘అండమాన్ ను దర్శించదలచుకొన్న వ్యక్తులు కూడా అక్కడి విమానాశ్రయానికి అధిక సామర్థ్యం ఉండాలన్న డిమాండు ను వ్యక్తపరిచారు’’ అని ఆయన అన్నారు.

పోర్ట్ బ్లేయ‌ర్ లో విమానాశ్రయం సదుపాయాల విస్తరణ సంబంధి అభిలాష అంతకంతకు అధికం అవుతూ ఉండడాన్ని గురించి ప్రధాన మంత్రి ఇంకా కాస్త వివరం గా మాట్లాడుతూ, ఇంతవరకు ఇప్పుడు ఉన్న టర్మినల్ 4,000 మంది యాత్రికుల అవసరాల ను తీర్చగలిగేది, అయితే క్రొత్త టర్మినల్ ఈ సంఖ్య ను 11,000 కు తీసుకు పోయిందని, మరి ప్రస్తుతం ఈ విమానాశ్రయం లో ఏ కాలం లో అయినా పది విమానాల ను నిలిపి ఉంచవచ్చు అన్నారు. మరిన్ని విమానాలు మరింత మంది యాత్రికులు ఈ ప్రాంతాని కి మరిన్ని కొలువులను తీసుకు వస్తాయి సుమా అని ఆయన అన్నారు. పోర్ట్ బ్లేయ‌ర్ లో నూతన టర్మినల్ భవనం ప్రయాణ సౌలభ్యాన్ని, వ్యాపారం చేయడం లో సౌలభ్యాన్ని మరియు కనెక్టివిటీ ని పెంచుతుంది అని ప్రధాన మంత్రి అన్నారు.

దేశం లో ఆదివాసీ ప్రాంతాలు మరియు ద్వీపాలు ఎంతో కాలంపాటు అభివృద్ధి కి నోచుకోకుండా మిగిలాయి అని ప్రధాన మంత్రి అంటూ ‘‘భారతదేశం లో చాలా కాలం పాటు అభివృద్ధి యొక్క లక్ష్యం పెద్ద నగరాల కు పరిమితం అయింది’’ అన్నారు. గడచిన తొమ్మిది సంవత్సరాల లో, వర్తమాన ప్రభుత్వం గత కాలం లోని ప్రభుత్వాల పొరపాటుల ను అత్యంత సూక్ష్మగ్రాహ్యత తో సరిదిద్దడం ఒక్కటే కాకుండా ఒక సరిక్రొత్త వ్యవస్థ ను కూడా తీసుకు వచ్చింది అని ఆయన అన్నారు. ‘‘భారతదేశం లో అన్ని వర్గాల ను కలుపుకొని పోయేటటువంటి ఒక నవీన అభివృద్ధి నమూనా తెర మీదకు వచ్చింది. ఆ నమూనా యే ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ అభివృద్ధి నమూనా అనేది ఎంతో సమగ్రం అయినటువంటిది. దీనిలో ప్రతి ఒక్క ప్రాంతం మరియు సమాజం లోని ప్రతి వర్గం అభివృద్ధి తో పాటు విద్య, ఆరోగ్యం మరియు కనెక్టివిటీ ల వంటి జీవనాని కి సంబంధించిన ప్రతి ఒక్క అంశం కలిసివుంది అని ఆయన వివరించారు.

 

గత తొమ్మిదేళ్ళ లో అండమాన్ లో అభివృద్ధి తాలూకు ఒక క్రొత్త కథ ను వ్రాయడమైంది అని ప్రధాన మంత్రి అన్నారు. మునుపటి ప్రభుత్వం హయాం లో తొమ్మిది సంవత్సరాల లో అండమాన్ మరియు నికోబార్ 23,000 కోట్ల రూపాయల బడ్జెటు ను అందుకోగా, ప్రస్తుత ప్రభుత్వం యొక్క తొమ్మిదేళ్ళ పాలన లో సుమారు 48,000 కోట్ల రూపాయల బడ్జెటు ను అండమాన్ మరియు నికోబార్ కు కేటాయించడం జరిగింది. అదే విధం గా, ఇదివరకటి ప్రభుత్వం యొక్క తొమ్మిది సంవత్సరాల ఏలుబడి లో 28,000 కుటుంబాల కు నల్లా నీరు అందించడం జరగగా, గడచిన తొమ్మిది సంవత్సరాల లో ఈ సంఖ్య 50,000 గా ఉంది అని ఆయన అన్నారు. ప్రస్తుతం అండమాన్ మరియు నికోబార్ ప్రాంతం లో ప్రతి ఒక్కరు ఒక బ్యాంకు ఖాతా ను మరియు వన్ నేశన్, వన్ రేషన్ కార్డు సదుపాయాన్ని కలిగి ఉన్నారని ప్రధాన మంత్రి చెప్పారు. పోర్ట్ బ్లేయ‌ర్ లో వైద్య చికిత్స కళాశాల ఏర్పడడాని కి కూడా వర్తమాన ప్రభుత్వం బాధ్యత తీసుకుంది. అదే అంతకు పూర్వం ఈ కేంద్ర పాలిత ప్రాంతం లో మెడికల్ కాలేజీ ఏదీ లేదు అని ఆయన అన్నారు. ఇంతకు ముందు ఇంటర్ నెట్ అచ్చం గా మానవ నిర్మిత ఉపగ్రహాల పైన ఆధారపడి ఉండేది. ప్రస్తుతం వర్తమాన ప్రభుత్వం సముద్రం అంతర్భాగంలో వంద ల కిలో మీటర్ ల కొద్దీ ఆప్టికల్ ఫైబర్ ను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తీసుకుంది అని ఆయన చెప్పారు.

ఈ సదుపాయాల విస్తరణ అనేది ఇక్కడ పర్యటన కు వేగగతి ని ఇస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. మొబైల్ కనెక్టివిటీ, ఆరోగ్య రంగ సంబంధి మౌలిక సదుపాయాల కల్పన, విమానాశ్రయం, ఇంకా రహదారులు.. ఇవి సందర్శకుల రాక ను ప్రోత్సహించేవే అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ కారణం గా యాత్రికుల సందర్శన లు 2014 వ సంవత్సరం తో పోల్చి చూసినప్పుడు రెట్టింపు అయ్యాయి అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. అడ్ వెన్చర్ టూరిజం సైతం వర్ధిల్లుతున్నది, మరి తత్సంబంధి సంఖ్య లు రాబోయే సంవత్సరాల లో అనేక రెట్లు పెరుగుతాయి అని ఆయన అన్నారు.

‘‘అండమాన్ ప్రాంతం అభివృద్ధి మరియు వారసత్వం చెట్టపట్టాల్ వేసుకొంటున్న ఒక మహామంత్రం తాలూకు సజీవ తార్కాణం గా మారిపోతున్నది’’ అని ప్రధాన మంత్రి అభివర్ణించారు. మువ్వన్నెల పతాకం ఎర్ర కోట లో ఎగురవేయడాని కంటే పూర్వమే అండమాన్ లో రెప రెప లాడింది. అయినప్పటికీ ఆ దీవి లో బానిసత్వం తాలూకు సంకేతాల ను గమనించవచ్చును అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఒకప్పుడు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన స్థలం లోనే జాతీయ జెండా ను ఎగురవేసే అవకాశం దక్కినందుకు ప్రధాన మంత్రి తన కృతజ్ఞత ను వ్యక్తం చేశారు. రాస్ ఐలండ్ ను నేతాజీ సుభాష్ ఐలండ్ గా, హేవలాక్ ఐలండ్ ను స్వరాజ్ ఐలండ్ గా, నీల్ ఐలండ్ ను శహీద్ ఐలండ్ గా సరిక్రొత్త గా నామకరణం చేసింది ప్రస్తుత ప్రభుత్వమే అని ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రస్తావించారు. 21 దీవుల కు పరమ వీర చక్ర పురస్కార గ్రహీత ల పేరుల ను పెట్టిన సంగతి ని సైతం ఆయన గుర్తు కు తెచ్చారు. ‘‘అండమాన్, నికోబార్ దీవుల అభివృద్ధి దేశ యువత కు ఒక ప్రేరణాధారం గా అయింది’’ అని ఆయన అన్నారు.

భారతీయుల సామర్థ్యాల విషయం లో ఎలాంటి అనుమానం లేదు, ఈ కారణం గా భారతదేశం స్వాతంత్య్రం సిద్ధించిన అనంతరం గత 75 సంవత్సరాల లో నూతన శిఖరాల ను అందుకొని ఉండాల్సింది అని ప్రధాన మంత్రి అన్నారు. ఏమైనా అవినీతి మరియు వంశవాద రాజకీయాలు సామాన్య పౌరుల బలాల కు సర్వదా అన్యాయం చేస్తూ వచ్చాయి అని ఆయన అన్నారు. కొన్ని పార్టీ లు అనుసరించిన అవకాశవాద రాజకీయాల ను గురించి కూడా ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. కులవాద ప్రధాన రాజకీయాల ను మరియు అవినీతి ని ఆయన విమర్శించారు. అవినీతి ఛాయలు ముసిరిన వ్యక్తుల ను, అటువంటి వారు కొన్ని సందర్భాల లో జామీను పై ఉన్నా గాని చివరకు దోషిగా తేలిన వారి ని సహించడాన్ని సైతం ఆయన విమర్శించారు. రాజ్యాంగాన్ని బందీ గా చేసే మనస్తత్వాన్ని ఆయన గర్హించారు. అటువంటి శక్తులు స్వార్థపరమైనటువంటి కుటుంబ ప్రయోజనాల పైనే శ్రద్ధ వహించాయి అని ఆయన అన్నారు. రక్షణ రంగం లో మరియు స్టార్ట్-అప్ రంగం లో భారతదేశాని కి చెందిన యువతీ యువకుల లో గల బలాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. యువత లో ఉన్న ఈ బలాని కి ఎటువంటి న్యాయం జరగకపోవడం శోచనీయం అని ఆయన అన్నారు.

దేశం యొక్క అభివృద్ధి కోసం మనల ను మనం అంకితం చేసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగింపు లో స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రపంచం లో అపూర్వమైనటువంటి పురోగతి ని సాధించిన దీవులు మరియు చిన్న కోస్తా తీర ప్రాంత దేశాల కు సంబంధించిన ఉదాహరణ లు ఎన్నో ఉన్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. ప్రగతి మార్గం లో సవాళ్ళు ఉన్నప్పటికీ అభివృద్ధి అనేది అన్ని రకాలైన పరిష్కారాల తో తరలి వస్తుంది అని ఆయన పేర్కొన్నారు. అండమాన్, నికోబార్ దీవుల లో జరుగుతున్న అభివృద్ధి పనులు ఆ ప్రాంతాన్ని అంతటి ని మరింత పటిష్ట పరచ గలుగుతాయన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

పూర్వరంగం

కనెక్టివిటీ సంబంధి మౌలిక సదుపాయాల కల్పన ను పెంపొందింప చేయడం అనేది ప్రభుత్వం యొక్క ప్రాధాన్యం గా ఉంటూ వస్తోంది. సుమారు గా 710 కోట్ల రూపాయలు ఖర్చు తో నిర్మించినటువంటి క్రొత్త ఏకీకృత‌ టర్మినల్ భవనం యొక్క ప్రారంభం ఈ కేంద్ర పాలిత ప్రాంతం లో కనెక్టివిటీ ని వృద్ధి చెందింప చేయడం లో కీలక పాత్ర ను పోషించగలదు. ఇంచు మించు 40,800 చదరపు మీటర్ ల మొత్తం నిర్మాణ క్షేత్రాన్ని కలిగివున్నటువంటి ఈ క్రొత్త టర్మినల్ భవనం ప్రతి సంవత్సరం ఇంచుమించు 50 లక్షల యాత్రికుల రాక పోకల ను సంబాళించగలిగే సామర్థ్యాన్ని కలిగివుంటుంది. పోర్ట్ బ్లేయర్ విమానాశ్రయం లో బోయింగ్-767- 400 రకం విమానాలు రెండు మరియు ఎయర్ బస్-321 రకం విమానాలు రెండు ఆగేందుకు అనువుగా ఉండే ఒక ఏప్రన్ ను 80 కోట్ల రూపాయల ఖర్చు తో ఈ నిర్మించడం జరిగింది. దీని ద్వారా ఈ విమానాశ్రయం ఇక ఏక కాలం లో పది విమానాల ను నిలిపి ఉంచే సామర్థ్యాన్ని కలిగివుంటుంది.

ప్రకృతి నుండి ప్రేరణ ను పొందిన దీని వాస్తుశిల్ప రచన సముద్రాన్ని మరియు దీవుల ను కళ్ళకు కడుతూ, ఒక చిప్ప ఆకారం లో కనిపిస్తూ ఉంటుంది. క్రొత్త విమానాశ్రయం యొక్క భవనం లో వేడిమి ప్రభావాన్ని తగ్గించడం కోసం డబల్ ఇన్సులేటెడ్ రూఫింగ్ సిస్టమ్, భవనం లోపల కృత్రిమ ప్రకాశాన్ని ఉపయోగించడాన్ని తగ్గించడం కోసం మరియు తగినంత మోతాదు లో సూర్య కాంతి వీలైనంత ఎక్కువ స్థాయి లో ప్రవేశించడం కోసం స్కైలైట్స్ ఏర్పాటు, ఎల్ఇడి లైటింగ్, వేడిమి ని తగ్గించే గ్లేజింగ్ వంటి స్థిరత్వం కలిగిన అనేకమైన ప్రత్యేకత లు ఉన్నాయి. ఈ భవనం లో ఏర్పాటు చేసిన అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంకు లో వాన నీటి ని ఒడిసిపట్టడం జరుగుతుంది. వ్యర్థ జలాల ను పూర్తి గా శుద్ధి చేసి లేండ్ స్కేపింగ్ కోసం తిరిగి ఉపయోగం లోకి తీసుకు రావడం తో పాటుగా ఆన్- సైట్ సీవేజి ట్రీట్ మెంట్ ప్లాంటు మరియు 500 కిలోవాట్ సామర్థ్యం కలిగిన సౌర శక్తి ప్లాంటు కూడా ఈ టర్మినల్ భవనం లో ఇతర విశిష్టతలు గా ఉన్నాయి. ఇవి దీవుల పర్యావరణం పై కనీస స్థాయి ప్రతికూల ప్రభావాన్ని కలగజేయనున్నాయి.

ప్రాచీనమైనటువంటి అండమాన్ మరియు నికోబార్ దీవుల కు ప్రవేశ ద్వారం గా ఉన్నటువంటి పోర్ట్ బ్లేయర్ పర్యటకుల కు చాలా లోకప్రియమైన గమ్య స్థలం గా ఉన్నది. ఈ సువిశాలమైన క్రొత్త ఏకీకృత‌ టర్మినల్ గగనతల రాకపోకల ను పెంపొందింప చేయడం తో పాటు గా ఈ ప్రాంతం లో పర్యటన ను వృద్ధి చెందింప చేయడం లో సాయపడనుంది. దీనితో స్థానిక ప్రజల కు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ గా లభించగలవు; అంతేకాదు, ఈ ప్రాంతం యొక్క ఆర్థిక వ్యవస్థ కు ఉత్తేజాన్ని అందించడం లోనూ ఇది సాయపడగలదు. 

 

 

 

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం

ప్రముఖ ప్రసంగాలు

77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారాల నుండి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం పాఠం
Tamil Nadu is writing a new chapter of progress in Thoothukudi: PM Narendra Modi

Media Coverage

Tamil Nadu is writing a new chapter of progress in Thoothukudi: PM Narendra Modi
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles loss of lives due to road accident in Dindori, Madhya Pradesh
February 29, 2024

The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief over the loss of lives due to road accident in Dindori district of Madhya Pradesh.

Shri Modi also wished speedy recovery for those injured in the accident.

The Prime Minister’s Office posted on X;

“मध्य प्रदेश के डिंडोरी में हुई सड़क दुर्घटना अत्यंत दुखद है। मेरी संवेदनाएं शोकाकुल परिजनों के साथ हैं। ईश्वर उन्हें इस कठिन समय में संबल प्रदान करे। इसके साथ ही मैं सभी घायल लोगों के जल्द स्वस्थ होने की कामना करता हूं। राज्य सरकार की देखरेख में स्थानीय प्रशासन पीड़ितों की हरसंभव सहायता में जुटा है: PM @narendramodi”