అస్సాంలోని గౌహతిలో బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార భాస్కర వర్మ సేతును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రారంభించారు. గౌహతితో పాటు పరిసర ప్రాంతాలకు ఈ వంతెన అత్యంత కీలకమైన మౌలిక సదుపాయమని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. "ఈ వంతెన ద్వారా రవాణా, ప్రయాణ సౌలభ్యం, వాణిజ్యం గణనీయంగా మెరుగుపడటమే కాక, కామాఖ్య దేవాలయానికి భక్తులు మరింత సులభంగా చేరుకోవటానికి వీలవుతుంది" అని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన కుమార భాస్కర వర్మ సేతు వంతెన గౌహతి, దాని పరిసర ప్రాంతాలకు కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టు. దీని వల్ల రవాణా సౌకర్యం, ప్రయాణ సౌలభ్యం, వాణిజ్యం గణనీయంగా మెరుగుపడతాయి. భక్తులు మరింత సులభంగా కామాఖ్య ఆలయాన్ని సందర్శించేందుకు ఇది దోహదపడుతుంది"

Kumar Bhaskar Varma Setu across the Brahmaputra is a vital infrastructure project for Guwahati and areas around it. Connectivity, comfort and commerce will be significantly enhanced. It will enable devotees to go to the Kamakhya Temple with greater ease. pic.twitter.com/bdpjbW0oNk
— Narendra Modi (@narendramodi) February 14, 2026


