· ‘అభివృద్ధి చెందుతున్న భారత్’ స్ఫూర్తిని ప్రతిబింబించే వికాస నమూనాగా ఢిల్లీని తీర్చిదిద్దుతున్నాం
· ప్రజల జీవన సౌలభ్యమే లక్ష్యంగా నిరంతర కృషి: ప్రతి విధానం, ప్రతి నిర్ణయం ఆ దిశగానే...
· మా దృష్టిలో సంస్కరణ అంటే సుపరిపాలన అందించడమే
· సమగ్ర జీఎస్టీ సంస్కరణలతో దేశవ్యాప్తంగా ప్రజలకు రెట్టింపు ప్రయోజనాలు
· చక్రధారి మోహన కృష్ణుడు, చరఖాధారి మోహన్‌దాస్ గాంధీ ఇద్దరూ మనకు ఆదర్శం: కృష్ణుడు ప్రేరణగా దేశాన్ని శక్తిమంతం చేసుకుందాం... మహాత్ముడి స్ఫూర్తితో భారత్‌ స్వావలంబనను సాధిద్దాం
· స్థానికత కోసం గొంతెత్తుదాం... ‘మేడిన్ ఇండియా’ ఉత్పత్తులను విశ్వసిద్దాం, కొనుగోలు చేద్దాం: ప్రధాని

ఢిల్లీలోని రోహిణిలో దాదాపు రూ.11,000 కోట్ల విలువైన రెండు ప్రధాన జాతీయ రహదారి ప్రాజెక్టులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సభనుద్దేశించి ప్రసంగించారు. ఈ ఎక్స్‌ప్రెస్ రహదారి పేరు ‘ద్వారక’ అని, ఈ కార్యక్రమం ‘రోహిణి’లో జరుగుతోందని చెప్తూ స్థల ప్రాధాన్యాన్ని వివరించారు. జన్మాష్టమి వేళ పండుగ వాతావరణం వెల్లివిరుస్తోందన్న ఆయన.. తానూ ఆ ద్వారకాధీశుడి ప్రాంతానికే చెందినవాడినని గుర్తు చేసుకున్నారు. అక్కడి వాతావరణమంతా కృష్ణ భక్తితో నిండిపోయిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

ఆగస్టు నెలంతా స్వతంత్ర భావాలు, ఉద్యమ స్ఫూర్తితో నిండి ఉంటుందన్న శ్రీ మోదీ.. ‘ఆజాదీ కా మహోత్సవ్’ వేడుకల నడుమ దేశ రాజధాని ఢిల్లీ విప్లవాత్మకమైన అభివృద్ధికి నిలయమైందన్నారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారి, నగర విస్తరణ రహదారులతో నేటి ఉదయం ఢిల్లీకి మెరుగైన రవాణా సదుపాయాలు లభించాయని తెలిపారు. ఈ ప్రాజెక్టులు ఢిల్లీ, గురుగ్రామ్‌తోపాటు మొత్తం రాజధాని ప్రాంత ప్రజలకు సౌలభ్యాన్ని పెంచనున్నాయి. కార్యాలయాలు, ఫ్యాక్టరీలకు ప్రయాణించడం సులభతరమవుతుందని, అందరికీ సమయం ఆదా అవుతుందని అన్నారు. ఈ రవాణా సదుపాయాల వల్ల వర్తకులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, రైతులకు ఎంతగానో ప్రయోజనం లభిస్తుందన్నారు. ఈ ఆధునిక రహదారి మౌలిక సదుపాయాల అభివృద్ధి నేపథ్యంలో ఢిల్లీ ప్రజలందరికీ ఆయన అభినందనలు తెలిపారు.

 

స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఎర్రకోట వేదికగా దేశ ఆర్థిక వ్యవస్థ, స్వావలంబన, ఆత్మవిశ్వాసంపై సవివరంగా తాను చేసిన ప్రసంగాన్ని ప్రధానమంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. “ఎన్నెన్నో ఆకాంక్షలు, స్వప్నాలు, సంకల్పాలు నేడు భారత్ గమ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. ప్రపంచమంతటికీ ఇది స్పష్టంగా అవగతమవుతోంది” అన్నారు. ప్రపంచదేశాలు భారత్‌ను చూసి దేశ పురోగతిపై ఓ అంచనాకు రావాలంటే, రాజధాని ఢిల్లీపైనే మొదటగా అందరి దృష్టీ పడుతుందన్నారు. పురోగమిస్తున్న, ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతున్న భారతదేశానికి ఇది రాజధాని అన్న అనుభూతి ప్రతిఒక్కరికీ కలిగేలా.. అభివృద్ధికి నమూనాగా ఢిల్లీని నిలపడం అత్యావశ్యకమని శ్రీ మోదీ చెప్పారు.

ఈ పురోగతిని సాధించడానికి గత 11 సంవత్సరాలుగా వివిధ స్థాయుల్లో ప్రభుత్వం నిరంతరం కృషి చేసిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాంతంలోని ఆధునిక, విస్తారమైన ఎక్స్‌ప్రెస్ రహదారులను ప్రస్తావిస్తూ.. రవాణాపరంగా మునుపెన్నడూ లేనంత అభివృద్ధిని గత దశాబ్ద కాలంలో ఢిల్లీ సాధించిందని వివరించారు. “మెట్రో నెట్‌వర్క్ పరంగా ప్రపంచంలో అత్యధికంగా అనుసంధాన ప్రాంతాలున్న నగరాల్లో ఇప్పుడు రాజధాని ఢిల్లీ ఒకటి’’ అని శ్రీ మోదీ అన్నారు. నమో భారత్ ర్యాపిడ్ రైలు వంటి అధునాతన వ్యవస్థలతో ఈ ప్రాంతం సన్నద్ధంగా ఉందన్నారు. మునుపటి సమయంతతో పోలిస్తే, గత పదకొండేళ్లలో ఢిల్లీలో రాకపోకలు చాలా సులభతరమయ్యాయని ప్రధానమంత్రి తెలిపారు.

ఢిల్లీని ప్రపంచస్థాయి నగరంగా నిలిపేందుకు కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటించిన శ్రీ మోదీ.. నేడు ప్రతి ఒక్కరూ ఈ పురోగతిని ప్రత్యక్షంగా చూస్తున్నారన్నారు. ద్వారకా ఎక్స్‌ప్రెస్‌ రహదారి, నగర విస్తరణ రహదారులను అత్యున్నత ప్రమాణాలతో నిర్మించామన్నారు. శివారు ఎక్స్‌ప్రెస్ రహదారికి కొనసాగింపుగా నగర విస్తరణ రహదారి ఇప్పుడు ఢిల్లీ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతోపాటు రవాణా సదుపాయాన్ని గణనీయంగా పెంచుతుందన్నారు.

 

నగర విస్తరణ రహదారి ముఖ్య లక్షణాన్ని ప్రధానమంత్రి ప్రస్తావించారు. దీనికోసం లక్షలాది టన్నుల వ్యర్థాలను ఉపయోగించారని, తద్వారా ఢిల్లీకి చెత్త కుప్పల బాధను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని చెప్పారు. చెత్త కుప్పలను తొలగించి, ఆ వ్యర్థ పదార్థాలను రోడ్డు వేయడానికి తిరిగి ఉపయోగించామన్నారు. సమీపంలోనే ఉన్న భల్స్వా వ్యర్థాల నిర్వహణ ప్రాంతాన్ని ఉదాహరిస్తూ.. పరిసర ప్రాంతాల్లోని కుటుంబాలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయని శ్రీ మోదీ చెప్పారు. ఢిల్లీ వాసులకు అలాంటి సవాళ్ల నుంచి విముక్తి కలిగించే దిశగా ప్రభుత్వం క్రియాశీలంగా పనిచేస్తోందన్నారు.

శ్రీమతి రేఖా గుప్త నాయకత్వంలో ఢిల్లీ ప్రభుత్వం యమునా నదిని శుద్ధి చేయడంలో నిరంతరం నిమగ్నమై ఉండడంపై ప్రధానమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. యమునా నది నుంచి ఇప్పటికే 16 లక్షల మెట్రిక్ టన్నుల పూడికను తొలగించినట్టు ఆయన తెలిపారు. అనతికాలంలోనే ఢిల్లీలో 650 దేవి (ఢిల్లీ ఎలక్ట్రిక్ వెహికల్ ఇంటర్‌కనెక్టర్) ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించామని శ్రీ మోదీ చెప్పారు. నగరంలో ఎలక్ట్రిక్ బస్సుల సంఖ్య త్వరలోనే 2,000 దాటుతుందని ఆయన వెల్లడించారు. ‘గ్రీన్ ఢిల్లీ క్లీన్ ఢిల్లీ’ మంత్రాన్ని ఈ కార్యక్రమం మరింత బలోపేతం చేస్తుందన్నారు.

చాలా సంవత్సరాల తర్వాత తమ పార్టీ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందన్న ప్రధానమంత్రి.. నగరంలో అభివృద్ధి పేలవంగా ఉండడానికి గత ప్రభుత్వాలే కారణమని విమర్శించారు. గత ప్రభుత్వాలు సృష్టించిన గందరగోళం నుంచి ఢిల్లీని పైకి తేవడం కష్టతరమైన పనే అయినప్పటికీ, ప్రస్తుత ప్రభుత్వం ఢిల్లీ ప్రతిష్ఠను, అభివృద్ధిని పునరుద్ధరించడానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. వరుసగా ఉన్న ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలే ఉండడం విశేష పరిణామమని శ్రీ మోదీ చెప్పారు. తమ పార్టీకి, పార్టీ నాయకత్వానికి ఈ ప్రాంతమంతా ఇచ్చిన అపారమైన ఆశీస్సులను ఇది ప్రతిబింబిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ బాధ్యతను గుర్తిస్తూ, ఢిల్లీ అభివృద్ధికి తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంటుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికీ ప్రజల తీర్పును అంగీకరించలేకపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పార్టీలు ప్రజల నమ్మకానికి, వాస్తవాలకు దూరంగా ఉన్నాయని విమర్శించారు. కొన్ని నెలల కిందట ఢిల్లీ, హర్యానా ప్రజల మధ్య అగాధం సృష్టించేలా కుట్రలు పన్నారని గుర్తుచేశారు. ఢిల్లీకి సరఫరా అవుతున్న నీటిని హర్యానా వాసులు విషపూరితం చేస్తున్నారంటూ కొందరు తప్పుడు వాదనలు చేశారని ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఢిల్లీ, దేశ రాజధాని ప్రాంతం మొత్తం అలాంటి ప్రతికూల రాజకీయాల నుంచి ఇప్పుడు విముక్తి పొందిందన్న శ్రీ మోదీ.. ఈ ప్రాంతాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని పునరుద్ఘాటించారు. ఈ లక్ష్యం విజయవంతంగా నెరవేరుతుందని దీమా వ్యక్తం చేశారు.

 

“సుపరిపాలనే మన ప్రభుత్వాల పని తీరుకు గీటురాయి. పాలనలో ప్రజలే అత్యున్నతులు” అని శ్రీ మోదీ అన్నారు. ప్రజలకు జీవన సౌలభ్యాన్ని కల్పించడమే లక్ష్యంగా తమ పార్టీ నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ అంకితభావం పార్టీ విధానాలు, నిర్ణయాల్లో ప్రతిబింబిస్తుందన్నారు. హర్యానాలోని గత ప్రభుత్వాలను ప్రస్తావిస్తూ.. పలుకుబడి లేదా సిఫార్సు లేకుండా గతంలో ఒక్క నియామకమూ జరగడం కష్టంగా ఉండేదన్నారు. హర్యానాలో తమ ప్రభుత్వ హయాంలో పూర్తి పారదర్శకంగా నిర్వహించిన ప్రక్రియతో లక్షలాది యువత ప్రభుత్వ ఉద్యోగాలు పొందారని ఆయన వివరించారు. అంకితభావంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగించిన శ్రీ నాయబ్ సింగ్ సైనీని ఆయన ప్రశంసించారు.

ఢిల్లీలో ఒకప్పుడు శాశ్వత గృహాలు లేకుండా మురికివాడల్లో నివసించిన వారికి ఇప్పుడు పక్కా ఇళ్లు అందుతున్నాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. గతంలో విద్యుత్, నీరు, గ్యాస్ కనెక్షన్ల వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా లేని ప్రాంతాలు ఇప్పుడు ఈ ముఖ్య సేవలను పొందుతున్నాయని తెలిపారు. దేశ పురోగతిని ప్రస్తావిస్తూ.. గత 11 సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో రోడ్లను నిర్మించామని శ్రీ మోదీ తెలిపారు. రైల్వే స్టేషన్లలో సమూలంగా మార్పులు జరుగుతున్నాయని, వందే భారత్ వంటి ఆధునిక రైళ్లు గర్వకారణమని అన్నారు. ఇప్పుడు చిన్న నగరాల్లోనూ విమానాశ్రయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. రాజధాని ప్రాంతాన్ని ప్రస్తావిస్తూ.. విమానాశ్రయాల సంఖ్య విశేషంగా పెరిగిందని ప్రధానమంత్రి తెలిపారు. హిండన్ విమానాశ్రయం నుంచి అనేక నగరాలకు విమానాలు ఇప్పుడు నడుస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. నోయిడా విమానాశ్రయం కూడా పూర్తి కావస్తోందని తెలిపారు.

 

గత దశాబ్ద కాలంలో దేశంలో కాలం చెల్లిన విధానాలకు స్వస్తి పలకడం వల్లే ఈ పురోగతి సాధ్యమైందని శ్రీ మోదీ పేర్కొన్నారు. దేశానికి అవసరమైన స్థాయిలో మౌలిక సదుపాయాలను, దానికి అవసరమమైన వేగాన్ని గతంలో సాధించలేదని చెప్పారు. తూర్పు, పశ్చిమ శివార్ల ఎక్స్‌ప్రెస్ రహదారుల గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ.. రాజధాని ఢిల్లీకి అనేక దశాబ్దాలుగా ఈ రోడ్ల ఆవశ్యకత ఉందన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఈ ప్రాజెక్టులకు సంబంధించిన ఫైళ్లలో కదలిక మాత్రమే మొదలైందని, ప్రజలు తమ పార్టీకి ప్రజాసేవా భాగ్యం కల్పించిన తర్వాతే వాస్తవంగా పనులు ప్రారంభమయ్యాయని శ్రీ మోదీ తెలిపారు. కేంద్రంలో, హర్యానాలో తమ ప్రభుత్వాలు ఏర్పడ్డాకే రోడ్లు సాకారమయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ రహదారులు నేడు దేశానికి విశేష సేవలందిస్తున్నాయని ప్రధానమంత్రి గర్వంగా చెప్పారు.

అభివృద్ధి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం ఒక్క ఢిల్లీలోనే కాదని, దేశవ్యాప్తంగా కొనసాగేదని శ్రీ మోదీ అన్నారు. గతంలో మౌలిక సదుపాయాలకు కేటాయించే బడ్జెట్ చాలా తక్కువగా ఉండేదని, మంజూరు చేసిన ప్రాజెక్టులు కూడా పూర్తి కావడానికి సంవత్సరాలు పట్టేదని చెప్పారు. గత 11 సంవత్సరాల్లో మౌలిక సదుపాయాల బడ్జెట్ ఆరు రెట్లకు పైగా పెరిగిందని ఆయన తెలిపారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడంపైనే ప్రస్తుతం ప్రభుత్వం దృష్టి పెట్టిందని, అందుకే ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారి వంటి కార్యక్రమాలు నేడు సాకారమవుతున్నాయని ప్రధానమంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టుల్లో గణనీయంగా పెట్టుబడులు పెట్టడం వల్ల సదుపాయాలు మెరుగుపడడమే కాకుండా, పెద్ద సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. భారీ నిర్మాణ కార్యకలాపాలు కార్మికుల నుంచి ఇంజినీర్ల వరకు లక్షలాది మందికి పని కల్పిస్తాయనీ, అలాగే నిర్మాణ సామగ్రి వినియోగంతో అనుబంధ కర్మాగారాలు, దుకాణాల్లో ఉపాధి పెరుగుతుందని శ్రీ మోదీ చెప్పారు. ఈ అభివృద్ధి ప్రాజెక్టులతో రవాణా, లాజిస్టిక్స్ రంగాల్లోనూ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయని ఆయన తెలిపారు.

 

గతంలో సుదీర్ఘకాలం పాలకులుగా ఉన్నవారు పెత్తనం చేయడమే ప్రధాన లక్ష్యంగా భావించారని శ్రీ మోదీ అన్నారు. ప్రజల జీవితాల్లో నుంచి ప్రభుత్వ ఒత్తిడిని, జోక్యాన్ని తొలగించడమే లక్ష్యంగా తమ పార్టీ కృషి చేస్తోందన్నారు. ఓ ఉదాహరణతో గత పరిస్థితులను ఆయన వివరించారు. ఢిల్లీలో స్వచ్ఛత బాధ్యతను భుజాన మోస్తున్న పారిశుద్ధ్య కార్మికులను గతతంలో బానిసల్లాగా చూసేవారన్నారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ చట్టానికి సంబంధించి, విస్మయం కలిగించే ఓ అంశాన్ని శ్రీ మోదీ వెల్లడించారు. దాని ప్రకారం, ముందస్తు నోటీసు లేకుండా పారిశుద్ధ్య కార్మికుడు విధులకు హాజరు కాలేకపోతే, నెల రోజుల జైలు శిక్ష విధించే నిబంధన ఉండేదని తెలిపారు. ఇంత చిన్న విషయానికే పారిశుద్ధ్య కార్మికులను జైలుకెలా పంపుతారని, ఇలాంటి చట్టాల వెనుక ఉన్న మనస్తత్వమేమిటని ప్రధానమంత్రి ప్రశ్నించారు. ఇప్పుడు సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్న వారు దేశంలో ఇటువంటి అన్యాయమైన చట్టాలను కొనసాగించారని ఆయన విమర్శించారు. ఇటువంటి తిరోగమన చట్టాలను గుర్తించి రద్దు చేస్తున్నది తమ ప్రభుత్వమేనని శ్రీ మోదీ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఇప్పటికే ఇలాంటి వందలాది చట్టాలను రద్దు చేసిందని, ఆ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.

“మా దృష్టిలో సంస్కరణ అంటే అందరికీ సుపరిపాలనను అందించడమే’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. సంస్కరణలపైనే నిరంతరం దృష్టి పెడుతున్నామని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రజలకు జీవన సౌలభ్యంతోపాటు వాణిజ్య సౌలభ్యాన్నీ అందించే దిశగా అనేక ప్రధాన సంస్కరణలను ప్రవేశపెడతామని ఆయన ప్రకటించారు. “ఇందులో భాగంగా జీఎస్టీ సమగ్ర సంస్కరణలపై దృష్టిపెడుతున్నాం. ఈ దీపావళికి జీఎస్టీ సంస్కరణతో ప్రజలకు రెట్టింపు బోనస్ లభిస్తుంది’’ అని శ్రీ మోదీ అన్నారు. పూర్తి కార్యాచరణ విధాన ఏర్పాట్ల వివరాలను అన్ని రాష్ట్రాలకూ పంపామని, కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి అన్ని రాష్ట్రాలూ సహకరిస్తాయని ఆశిస్తున్నామని శ్రీ మోదీ చెప్పారు. ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని, దాంతో ఈ దీపావళి మరింత ప్రత్యేకమవుతుందని ఆయన అన్నారు. జీఎస్టీని మరింత సరళీకృతం చేయడం, పన్ను రేట్లను సవరించడం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని, ఈ సంస్కరణ ప్రయోజనాలు ఇంటింటికీ.. ముఖ్యంగా పేద, మధ్యతరగతికి చేరుతాయని ప్రధానమంత్రి తెలిపారు. ఈ మార్పుల వల్ల అన్ని స్థాయుల్లోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, వర్తకులు, వ్యాపారులు కూడా ప్రయోజనం పొందుతారని తెలిపారు.

ప్రాచీన సంస్కృతి, వారసత్వం భారతదేశ గొప్ప బలాల్లో ఒకటిగా పేర్కొన్న శ్రీ మోదీ.. ఈ సాంస్కృతిక వారసత్వంలో జీవిత తాత్వికత ప్రస్ఫురిస్తుందన్నారు. ఈ తాత్వికతలో ‘చక్రధారి మోహనుడు’, ‘చరఖాధారి మోహనుడు’ ఇద్దరూ మనకు ఎదురవుతారన్నారు. వీరిద్దరి బోధనల సారం దేశంలో ఎప్పటికప్పుడు ప్రస్ఫుటమవుతోందన్నారు. ‘చక్రధారి మోహనుడు’ అంటే సుదర్శన చక్రశక్తిని ప్రదర్శించిన శ్రీ కృష్ణ భగవానుడనీ, ‘చరఖాధారి మోహనుడు’ అంటే రాట్నం ద్వారా స్వదేశీ శక్తిని దేశానికి తెలియజేసి జాగృతం చేసిన మహాత్మాగాంధీ అని ప్రధానమంత్రి వివరించారు.

 

‘‘భారత్‌ను శక్తిమంతం చేయడానికి చక్రధారి మోహనుడి నుంచి మనం ప్రేరణ పొందాలి. దేశం స్వావలంబన సాధించేందుకు చరఖాధారి మోహన్ మార్గాన్ని అనుసరించాలి’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘వోకల్ ఫర్ లోకల్’ అనేది ప్రతి భారతీయుడి జీవన మంత్రంగా మారాలని కోరారు. ప్రతి సంకల్పాన్నీ నెరవేర్చిన భారత్‌కు ఈ లక్ష్యాన్ని చేరుకోవడం పెద్ద కష్టమమేమీ కాదని ఆయన వ్యాఖ్యానించారు. ఖాదీని ఇందుకు ఉదాహరించారు. ఒకప్పుడు అంతరించిపోయే దశలో ఉన్న దీని గురించి దేశానికి తాను చేసిన విజ్ఞప్తిని శ్రీ మోదీ గుర్తు చేసుకున్నారు. సమష్టి సంకల్పంతో అద్భుతమైన ఫలితాలు వచ్చాయన్నారు. గత దశాబ్ద కాలంలో ఖాదీ అమ్మకాలు దాదాపు ఏడు రెట్లు పెరిగాయని ఆయన తెలిపారు. ‘వోకల్ ఫర్ లోకల్’ స్ఫూర్తితో దేశ ప్రజలు ఖాదీని అక్కున చేర్చుకున్నారని శ్రీ మోదీ చెప్పారు. మేడిన్ ఇండియా మొబైల్ ఫోన్లపై ప్రజలు చూపిన నమ్మకాన్నీ ప్రధానమంత్రి వివరించారు. “పదకొండేళ్ల కిందట భారత్ తన మొబైల్ ఫోన్‌లను ఎక్కువగా దిగుమతి చేసుకునేది. నేడు భారతీయుల్లో ఎక్కువ మంది మేడిన్ ఇండియా ఫోన్లను ఉపయోగిస్తున్నారు. భారత్ ఇప్పుడు ఏటా 30 నుంచి 35 కోట్ల మొబైల్ ఫోన్లను తయారు చేసి ఎగుమతి చేస్తోంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.

మేడిన్ ఇండియా యూపీఐ నేడు ప్రపంచంలో అతిపెద్ద రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల వేదికగా నిలిచిందని ప్రధానమంత్రి పేర్కొన్నారు. భారత్‌లో తయారైన రైలు కోచ్‌లు, లోకోమోటివ్‌లకు వేరే దేశాల్లోనూ డిమాండ్ పెరుగుతోందని వివరించారు.

రోడ్లతోపాటు మొత్తం మౌలిక సదుపాయాల విషయానికొస్తే, గతి శక్తి వేదికను భారత్ అభివృద్ధి చేసిందన్నారు. ఇందులో 1,600 డేటా లేయర్లు ఉన్నాయని తెలిపారు. వన్య ప్రాణులు, అటవీ ప్రాంతాలు, నదులు, జలమార్గాలు... ఏ అంశానికి సంబంధించిన ప్రాజెక్టయినా, అవసరమైన అన్ని నిబంధనలు, అనుమతులపై సమాచారం ఈ వేదికలోనే అందుబాటులో ఉంటుందని ప్రధానమంత్రి మోదీ తెలిపారు. ఆ సమాచారమంతా నిమిషాల్లోనే లభించడం ప్రాజెక్టులు వేగంగా పురోగమించడానికి వీలు కల్పిస్తుందన్నారు. ప్రత్యేకంగా గతిశక్తి విశ్వవిద్యాలయాన్నీ నెలకొల్పామని శ్రీ మోదీ తెలిపారు. గతిశక్తి దేశ పురోగతి కోసం శక్తిమంతమైన, విప్లవాత్మక మార్పులను తేగల మార్గంగా మారిందని ఆయన వివరించారు.

 

దశాబ్దం కిందట దేశంలోకి బొమ్మలు కూడా దిగుమతి అయ్యేవని శ్రీ మోదీ గుర్తుచేశారు. అయితే, భారతీయులు ‘వోకల్ ఫర్ లోకల్’ను ఆదరించాలని సంకల్పించడంతో దేశీయ బొమ్మల ఉత్పత్తి గణనీయంగా పెరగడమే కాకుండా, భారత్ ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలకు బొమ్మలను ఎగుమతి చేయడం మొదలైందన్నారు.

భారత్‌లో తయారైన ఉత్పత్తులపై ప్రజలంతా నమ్మకముంచాలని, ఇక్కడ తయారైన వస్తువులనే కొనుగోలు చేయాలని ప్రధానమంత్రి కోరారు. ‘‘మీరు భారతీయులైతే భారత్‌లో తయారైన వాటినే కొనండి’’ అన్నారు. ఈ పండుగల వేళ ప్రతి ఒక్కరూ స్థానిక ఉత్పత్తులతోనే ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకోవాలని శ్రీ మోదీ కోరారు. ప్రజలు జాగరూకతతో వ్యవహరిస్తూ.. బహుమతులుగా ఇవ్వడం కోసం భారత్‌లో, భారతీయులు తయారు చేసిన వస్తువులనే ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.

దేశవ్యాప్తంగా ఉన్న దుకాణదారులనుద్దేశించి ప్రధానమంత్రి మాట్లాడుతూ.. కొందరు కొంచెం ఎక్కువ లాభాల కోసం గతంలో విదేశీ వస్తువులను విక్రయించి ఉండొచ్చన్నారు. వారు తప్పేమీ చేయలేదని, ఇప్పుడు మాత్రం ‘వోకల్ ఫర్ లోకల్’ను మంత్రప్రదంగా స్వీకరించాలని కోరారు. ఈ ఒక్క చర్య దేశానికి ప్రయోజనం చేకూరుస్తుందని, అమ్మే ప్రతి వస్తువూ భారతీయ కార్మికుడికో లేదా పేద ప్రజలకో లాభాన్నిస్తుందని ఆయన వివరించారు. ప్రతి అమ్మకం ద్వారా వచ్చే డబ్బు మన దేశంలోనే ఉంటుందని, తోటి భారతీయులకు ప్రయోజనం చేకూరుస్తుందని శ్రీ మోదీ చెప్పారు. ఇది భారతీయుల కొనుగోలు శక్తిని పెంచుతుందని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుందని అన్నారు. భారత్‌లో తయారైన ఉత్పత్తులను సగర్వంగా అమ్మాలని దుకాణదారులకు ఆయన విజ్ఞప్తి చేశారు.

‘‘భారతదేశ అద్భుతమైన గతాన్ని ఆశాజనకమైన భవిష్యత్తుతో అనుసంధానించే రాజధానిగా ఢిల్లీ అభివృద్ధి చెందుతోంది’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ఇటీవల కొత్త కేంద్ర సచివాలయం కర్తవ్య భవన్ ప్రారంభోత్సవం, కొత్త పార్లమెంటు భవనం పూర్తవడం దీనినే వివరిస్తున్నాయి. కర్తవ్య పథ్ ఇప్పుడు సరికొత్త రూపంలో దేశం ఎదుట నిలిచిందని ఆయన పేర్కొన్నారు. భారత్ మండపం, యశోభూమి వంటి ఆధునిక సమావేశ కేంద్రాలు ఢిల్లీ ప్రతిష్ఠను పెంచుతున్నాయని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలన్నీ ఢిల్లీని వర్తక, వాణిజ్యాలకు ప్రధాన గమ్యస్థానంగా నిలుపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల శక్తి, స్ఫూర్తితో ప్రపంచంలోని అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా ఢిల్లీ ఎదుగుతుందని దీమా వ్యక్తం చేస్తూ ప్రధానమంత్రి తన ప్రసంగాన్ని ముగించారు.

 

కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి శ్రీమతి రేఖా గుప్తా, హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయబ్ సింగ్ సైనీ, కేంద్ర సహాయ మంత్రులు శ్రీ అజయ్ తమ్టా, శ్రీ హర్ష మల్హోత్రా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నేపథ్యం

ఢిల్లీ, పరిసర ప్రాంతాల్లో రవాణా సదుపాయాలను మెరుగుపరచడం, ప్రయాణ సమయాన్ని, ట్రాఫిక్‌ను తగ్గించడం లక్ష్యంగా ప్రభుత్వం రూపొందించిన సమగ్ర ప్రణాళికలో భాగంగా.. ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారి ఢిల్లీ విభాగం, నగర విస్తరణ రహదారి -II (యూఈఆర్-II) ప్రాజెక్టులకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. జీవన సౌలభ్యాన్ని పెంచడంతోపాటు సజావుగా ప్రయాణించగలిగేలా ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను నెలకొల్పాలన్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ లక్ష్యాన్ని ఈ కార్యక్రమాలు ప్రతిబింబిస్తాయి.

ద్వారకా ద్వారకా ఎక్స్‌ప్రెస్ రహదారిలోని 10.1 కి.మీ. పొడవైన ఢిల్లీ విభాగాన్ని దాదాపు రూ. 5,360 కోట్లతో అభివృద్ధి చేశారు. ఇది యశోభూమి, డీఎంఆర్‌సీ బ్లూ లైన్, ఆరెంజ్ లైన్, రాబోయే బిజ్వాసన్ రైల్వే స్టేషన్, ద్వారకా క్లస్టర్ బస్ డిపోలకు వివిధ మార్గాల్లో రవాణా సదుపాయాన్ని కూడా అందిస్తుంది. ఇందులోని భాగాలు:

 

ప్యాకేజీ-I: ద్వారకా సెక్టార్-21 వద్ద శివమూర్తి కూడలి నుంచి రోడ్ అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) వరకు 5.9 కి.మీ.

ప్యాకేజీ-II: ద్వారకా సెక్టార్-21 ఆర్‌యూబీ నుంచి ఢిల్లీ-హర్యానా సరిహద్దు వరకు 4.2 కి.మీ. యూఈఆర్-IIకు నేరుగా రవాణా సదుపాయాన్ని అందిస్తుంది.

ద్వారక ఎక్స్‌ప్రెస్‌ రహదారిలోని 19 కి.మీ పొడవైన హర్యానా విభాగాన్ని గతంలో 2024 మార్చిలో ప్రధానమంత్రి ప్రారంభించారు.

బహదూర్‌గఢ్, సోనిపట్‌లకు కొత్త లింకులతోపాటు యూఈఆర్-IIలోని అలీపూర్ - డిచావ్ కలాన్ పొడిగించిన మార్గాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించారు. దాదాపు రూ. 5,580 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఇది ఢిల్లీలోని ఇన్నర్, ఔటర్ రింగ్ రోడ్లు, ముకర్బా చౌక్, ధౌలా కువాన్, జాతీయ రహదారి-09 వంటి రద్దీ ప్రదేశాల్లో ట్రాఫిక్‌ను సులభతరం చేస్తుంది. కొత్త మార్గాలతో బహదూర్‌గఢ్, సోనిపట్‌లకు నేరుగా ప్రవేశించవచ్చు. అలాగే, పారిశ్రామిక ప్రాంతాలకు రవాణా సదుపాయాలు మెరుగుపడతాయి. నగరంలో ట్రాఫిక్‌ సమస్య తగ్గుతుంది. రాజధాని ఢిల్లీలో సరుకుల రవాణా వేగం పుంజుకుంటుంది.  

 

పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum

Media Coverage

'Will walk shoulder to shoulder': PM Modi pushes 'Make in India, Partner with India' at Russia-India forum
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Today, India is becoming the key growth engine of the global economy: PM Modi
December 06, 2025
India is brimming with confidence: PM
In a world of slowdown, mistrust and fragmentation, India brings growth, trust and acts as a bridge-builder: PM
Today, India is becoming the key growth engine of the global economy: PM
India's Nari Shakti is doing wonders, Our daughters are excelling in every field today: PM
Our pace is constant, Our direction is consistent, Our intent is always Nation First: PM
Every sector today is shedding the old colonial mindset and aiming for new achievements with pride: PM

आप सभी को नमस्कार।

यहां हिंदुस्तान टाइम्स समिट में देश-विदेश से अनेक गणमान्य अतिथि उपस्थित हैं। मैं आयोजकों और जितने साथियों ने अपने विचार रखें, आप सभी का अभिनंदन करता हूं। अभी शोभना जी ने दो बातें बताई, जिसको मैंने नोटिस किया, एक तो उन्होंने कहा कि मोदी जी पिछली बार आए थे, तो ये सुझाव दिया था। इस देश में मीडिया हाउस को काम बताने की हिम्मत कोई नहीं कर सकता। लेकिन मैंने की थी, और मेरे लिए खुशी की बात है कि शोभना जी और उनकी टीम ने बड़े चाव से इस काम को किया। और देश को, जब मैं अभी प्रदर्शनी देखके आया, मैं सबसे आग्रह करूंगा कि इसको जरूर देखिए। इन फोटोग्राफर साथियों ने इस, पल को ऐसे पकड़ा है कि पल को अमर बना दिया है। दूसरी बात उन्होंने कही और वो भी जरा मैं शब्दों को जैसे मैं समझ रहा हूं, उन्होंने कहा कि आप आगे भी, एक तो ये कह सकती थी, कि आप आगे भी देश की सेवा करते रहिए, लेकिन हिंदुस्तान टाइम्स ये कहे, आप आगे भी ऐसे ही सेवा करते रहिए, मैं इसके लिए भी विशेष रूप से आभार व्यक्त करता हूं।

साथियों,

इस बार समिट की थीम है- Transforming Tomorrow. मैं समझता हूं जिस हिंदुस्तान अखबार का 101 साल का इतिहास है, जिस अखबार पर महात्मा गांधी जी, मदन मोहन मालवीय जी, घनश्यामदास बिड़ला जी, ऐसे अनगिनत महापुरूषों का आशीर्वाद रहा, वो अखबार जब Transforming Tomorrow की चर्चा करता है, तो देश को ये भरोसा मिलता है कि भारत में हो रहा परिवर्तन केवल संभावनाओं की बात नहीं है, बल्कि ये बदलते हुए जीवन, बदलती हुई सोच और बदलती हुई दिशा की सच्ची गाथा है।

साथियों,

आज हमारे संविधान के मुख्य शिल्पी, डॉक्टर बाबा साहेब आंबेडकर जी का महापरिनिर्वाण दिवस भी है। मैं सभी भारतीयों की तरफ से उन्हें श्रद्धांजलि अर्पित करता हूं।

Friends,

आज हम उस मुकाम पर खड़े हैं, जब 21वीं सदी का एक चौथाई हिस्सा बीत चुका है। इन 25 सालों में दुनिया ने कई उतार-चढ़ाव देखे हैं। फाइनेंशियल क्राइसिस देखी हैं, ग्लोबल पेंडेमिक देखी हैं, टेक्नोलॉजी से जुड़े डिसरप्शन्स देखे हैं, हमने बिखरती हुई दुनिया भी देखी है, Wars भी देख रहे हैं। ये सारी स्थितियां किसी न किसी रूप में दुनिया को चैलेंज कर रही हैं। आज दुनिया अनिश्चितताओं से भरी हुई है। लेकिन अनिश्चितताओं से भरे इस दौर में हमारा भारत एक अलग ही लीग में दिख रहा है, भारत आत्मविश्वास से भरा हुआ है। जब दुनिया में slowdown की बात होती है, तब भारत growth की कहानी लिखता है। जब दुनिया में trust का crisis दिखता है, तब भारत trust का pillar बन रहा है। जब दुनिया fragmentation की तरफ जा रही है, तब भारत bridge-builder बन रहा है।

साथियों,

अभी कुछ दिन पहले भारत में Quarter-2 के जीडीपी फिगर्स आए हैं। Eight परसेंट से ज्यादा की ग्रोथ रेट हमारी प्रगति की नई गति का प्रतिबिंब है।

साथियों,

ये एक सिर्फ नंबर नहीं है, ये strong macro-economic signal है। ये संदेश है कि भारत आज ग्लोबल इकोनॉमी का ग्रोथ ड्राइवर बन रहा है। और हमारे ये आंकड़े तब हैं, जब ग्लोबल ग्रोथ 3 प्रतिशत के आसपास है। G-7 की इकोनमीज औसतन डेढ़ परसेंट के आसपास हैं, 1.5 परसेंट। इन परिस्थितियों में भारत high growth और low inflation का मॉडल बना हुआ है। एक समय था, जब हमारे देश में खास करके इकोनॉमिस्ट high Inflation को लेकर चिंता जताते थे। आज वही Inflation Low होने की बात करते हैं।

साथियों,

भारत की ये उपलब्धियां सामान्य बात नहीं है। ये सिर्फ आंकड़ों की बात नहीं है, ये एक फंडामेंटल चेंज है, जो बीते दशक में भारत लेकर आया है। ये फंडामेंटल चेंज रज़ीलियन्स का है, ये चेंज समस्याओं के समाधान की प्रवृत्ति का है, ये चेंज आशंकाओं के बादलों को हटाकर, आकांक्षाओं के विस्तार का है, और इसी वजह से आज का भारत खुद भी ट्रांसफॉर्म हो रहा है, और आने वाले कल को भी ट्रांसफॉर्म कर रहा है।

साथियों,

आज जब हम यहां transforming tomorrow की चर्चा कर रहे हैं, हमें ये भी समझना होगा कि ट्रांसफॉर्मेशन का जो विश्वास पैदा हुआ है, उसका आधार वर्तमान में हो रहे कार्यों की, आज हो रहे कार्यों की एक मजबूत नींव है। आज के Reform और आज की Performance, हमारे कल के Transformation का रास्ता बना रहे हैं। मैं आपको एक उदाहरण दूंगा कि हम किस सोच के साथ काम कर रहे हैं।

साथियों,

आप भी जानते हैं कि भारत के सामर्थ्य का एक बड़ा हिस्सा एक लंबे समय तक untapped रहा है। जब देश के इस untapped potential को ज्यादा से ज्यादा अवसर मिलेंगे, जब वो पूरी ऊर्जा के साथ, बिना किसी रुकावट के देश के विकास में भागीदार बनेंगे, तो देश का कायाकल्प होना तय है। आप सोचिए, हमारा पूर्वी भारत, हमारा नॉर्थ ईस्ट, हमारे गांव, हमारे टीयर टू और टीय़र थ्री सिटीज, हमारे देश की नारीशक्ति, भारत की इनोवेटिव यूथ पावर, भारत की सामुद्रिक शक्ति, ब्लू इकोनॉमी, भारत का स्पेस सेक्टर, कितना कुछ है, जिसके फुल पोटेंशियल का इस्तेमाल पहले के दशकों में हो ही नहीं पाया। अब आज भारत इन Untapped पोटेंशियल को Tap करने के विजन के साथ आगे बढ़ रहा है। आज पूर्वी भारत में आधुनिक इंफ्रास्ट्रक्चर, कनेक्टिविटी और इंडस्ट्री पर अभूतपूर्व निवेश हो रहा है। आज हमारे गांव, हमारे छोटे शहर भी आधुनिक सुविधाओं से लैस हो रहे हैं। हमारे छोटे शहर, Startups और MSMEs के नए केंद्र बन रहे हैं। हमारे गाँवों में किसान FPO बनाकर सीधे market से जुड़ें, और कुछ तो FPO’s ग्लोबल मार्केट से जुड़ रहे हैं।

साथियों,

भारत की नारीशक्ति तो आज कमाल कर रही हैं। हमारी बेटियां आज हर फील्ड में छा रही हैं। ये ट्रांसफॉर्मेशन अब सिर्फ महिला सशक्तिकरण तक सीमित नहीं है, ये समाज की सोच और सामर्थ्य, दोनों को transform कर रहा है।

साथियों,

जब नए अवसर बनते हैं, जब रुकावटें हटती हैं, तो आसमान में उड़ने के लिए नए पंख भी लग जाते हैं। इसका एक उदाहरण भारत का स्पेस सेक्टर भी है। पहले स्पेस सेक्टर सरकारी नियंत्रण में ही था। लेकिन हमने स्पेस सेक्टर में रिफॉर्म किया, उसे प्राइवेट सेक्टर के लिए Open किया, और इसके नतीजे आज देश देख रहा है। अभी 10-11 दिन पहले मैंने हैदराबाद में Skyroot के Infinity Campus का उद्घाटन किया है। Skyroot भारत की प्राइवेट स्पेस कंपनी है। ये कंपनी हर महीने एक रॉकेट बनाने की क्षमता पर काम कर रही है। ये कंपनी, flight-ready विक्रम-वन बना रही है। सरकार ने प्लेटफॉर्म दिया, और भारत का नौजवान उस पर नया भविष्य बना रहा है, और यही तो असली ट्रांसफॉर्मेशन है।

साथियों,

भारत में आए एक और बदलाव की चर्चा मैं यहां करना ज़रूरी समझता हूं। एक समय था, जब भारत में रिफॉर्म्स, रिएक्शनरी होते थे। यानि बड़े निर्णयों के पीछे या तो कोई राजनीतिक स्वार्थ होता था या फिर किसी क्राइसिस को मैनेज करना होता था। लेकिन आज नेशनल गोल्स को देखते हुए रिफॉर्म्स होते हैं, टारगेट तय है। आप देखिए, देश के हर सेक्टर में कुछ ना कुछ बेहतर हो रहा है, हमारी गति Constant है, हमारी Direction Consistent है, और हमारा intent, Nation First का है। 2025 का तो ये पूरा साल ऐसे ही रिफॉर्म्स का साल रहा है। सबसे बड़ा रिफॉर्म नेक्स्ट जेनरेशन जीएसटी का था। और इन रिफॉर्म्स का असर क्या हुआ, वो सारे देश ने देखा है। इसी साल डायरेक्ट टैक्स सिस्टम में भी बहुत बड़ा रिफॉर्म हुआ है। 12 लाख रुपए तक की इनकम पर ज़ीरो टैक्स, ये एक ऐसा कदम रहा, जिसके बारे में एक दशक पहले तक सोचना भी असंभव था।

साथियों,

Reform के इसी सिलसिले को आगे बढ़ाते हुए, अभी तीन-चार दिन पहले ही Small Company की डेफिनीशन में बदलाव किया गया है। इससे हजारों कंपनियाँ अब आसान नियमों, तेज़ प्रक्रियाओं और बेहतर सुविधाओं के दायरे में आ गई हैं। हमने करीब 200 प्रोडक्ट कैटगरीज़ को mandatory क्वालिटी कंट्रोल ऑर्डर से बाहर भी कर दिया गया है।

साथियों,

आज के भारत की ये यात्रा, सिर्फ विकास की नहीं है। ये सोच में बदलाव की भी यात्रा है, ये मनोवैज्ञानिक पुनर्जागरण, साइकोलॉजिकल रेनसां की भी यात्रा है। आप भी जानते हैं, कोई भी देश बिना आत्मविश्वास के आगे नहीं बढ़ सकता। दुर्भाग्य से लंबी गुलामी ने भारत के इसी आत्मविश्वास को हिला दिया था। और इसकी वजह थी, गुलामी की मानसिकता। गुलामी की ये मानसिकता, विकसित भारत के लक्ष्य की प्राप्ति में एक बहुत बड़ी रुकावट है। और इसलिए, आज का भारत गुलामी की मानसिकता से मुक्ति पाने के लिए काम कर रहा है।

साथियों,

अंग्रेज़ों को अच्छी तरह से पता था कि भारत पर लंबे समय तक राज करना है, तो उन्हें भारतीयों से उनके आत्मविश्वास को छीनना होगा, भारतीयों में हीन भावना का संचार करना होगा। और उस दौर में अंग्रेजों ने यही किया भी। इसलिए, भारतीय पारिवारिक संरचना को दकियानूसी बताया गया, भारतीय पोशाक को Unprofessional करार दिया गया, भारतीय त्योहार-संस्कृति को Irrational कहा गया, योग-आयुर्वेद को Unscientific बता दिया गया, भारतीय अविष्कारों का उपहास उड़ाया गया और ये बातें कई-कई दशकों तक लगातार दोहराई गई, पीढ़ी दर पीढ़ी ये चलता गया, वही पढ़ा, वही पढ़ाया गया। और ऐसे ही भारतीयों का आत्मविश्वास चकनाचूर हो गया।

साथियों,

गुलामी की इस मानसिकता का कितना व्यापक असर हुआ है, मैं इसके कुछ उदाहरण आपको देना चाहता हूं। आज भारत, दुनिया की सबसे तेज़ी से ग्रो करने वाली मेजर इकॉनॉमी है, कोई भारत को ग्लोबल ग्रोथ इंजन बताता है, कोई, Global powerhouse कहता है, एक से बढ़कर एक बातें आज हो रही हैं।

लेकिन साथियों,

आज भारत की जो तेज़ ग्रोथ हो रही है, क्या कहीं पर आपने पढ़ा? क्या कहीं पर आपने सुना? इसको कोई, हिंदू रेट ऑफ ग्रोथ कहता है क्या? दुनिया की तेज इकॉनमी, तेज ग्रोथ, कोई कहता है क्या? हिंदू रेट ऑफ ग्रोथ कब कहा गया? जब भारत, दो-तीन परसेंट की ग्रोथ के लिए तरस गया था। आपको क्या लगता है, किसी देश की इकोनॉमिक ग्रोथ को उसमें रहने वाले लोगों की आस्था से जोड़ना, उनकी पहचान से जोड़ना, क्या ये अनायास ही हुआ होगा क्या? जी नहीं, ये गुलामी की मानसिकता का प्रतिबिंब था। एक पूरे समाज, एक पूरी परंपरा को, अन-प्रोडक्टिविटी का, गरीबी का पर्याय बना दिया गया। यानी ये सिद्ध करने का प्रयास किया गया कि, भारत की धीमी विकास दर का कारण, हमारी हिंदू सभ्यता और हिंदू संस्कृति है। और हद देखिए, आज जो तथाकथित बुद्धिजीवी हर चीज में, हर बात में सांप्रदायिकता खोजते रहते हैं, उनको हिंदू रेट ऑफ ग्रोथ में सांप्रदायिकता नज़र नहीं आई। ये टर्म, उनके दौर में किताबों का, रिसर्च पेपर्स का हिस्सा बना दिया गया।

साथियों,

गुलामी की मानसिकता ने भारत में मैन्युफेक्चरिंग इकोसिस्टम को कैसे तबाह कर दिया, और हम इसको कैसे रिवाइव कर रहे हैं, मैं इसके भी कुछ उदाहरण दूंगा। भारत गुलामी के कालखंड में भी अस्त्र-शस्त्र का एक बड़ा निर्माता था। हमारे यहां ऑर्डिनेंस फैक्ट्रीज़ का एक सशक्त नेटवर्क था। भारत से हथियार निर्यात होते थे। विश्व युद्धों में भी भारत में बने हथियारों का बोल-बाला था। लेकिन आज़ादी के बाद, हमारा डिफेंस मैन्युफेक्चरिंग इकोसिस्टम तबाह कर दिया गया। गुलामी की मानसिकता ऐसी हावी हुई कि सरकार में बैठे लोग भारत में बने हथियारों को कमजोर आंकने लगे, और इस मानसिकता ने भारत को दुनिया के सबसे बड़े डिफेंस importers के रूप में से एक बना दिया।

साथियों,

गुलामी की मानसिकता ने शिप बिल्डिंग इंडस्ट्री के साथ भी यही किया। भारत सदियों तक शिप बिल्डिंग का एक बड़ा सेंटर था। यहां तक कि 5-6 दशक पहले तक, यानी 50-60 साल पहले, भारत का फोर्टी परसेंट ट्रेड, भारतीय जहाजों पर होता था। लेकिन गुलामी की मानसिकता ने विदेशी जहाज़ों को प्राथमिकता देनी शुरु की। नतीजा सबके सामने है, जो देश कभी समुद्री ताकत था, वो अपने Ninety five परसेंट व्यापार के लिए विदेशी जहाज़ों पर निर्भर हो गया है। और इस वजह से आज भारत हर साल करीब 75 बिलियन डॉलर, यानी लगभग 6 लाख करोड़ रुपए विदेशी शिपिंग कंपनियों को दे रहा है।

साथियों,

शिप बिल्डिंग हो, डिफेंस मैन्यूफैक्चरिंग हो, आज हर सेक्टर में गुलामी की मानसिकता को पीछे छोड़कर नए गौरव को हासिल करने का प्रयास किया जा रहा है।

साथियों,

गुलामी की मानसिकता ने एक बहुत बड़ा नुकसान, भारत में गवर्नेंस की अप्रोच को भी किया है। लंबे समय तक सरकारी सिस्टम का अपने नागरिकों पर अविश्वास रहा। आपको याद होगा, पहले अपने ही डॉक्यूमेंट्स को किसी सरकारी अधिकारी से अटेस्ट कराना पड़ता था। जब तक वो ठप्पा नहीं मारता है, सब झूठ माना जाता था। आपका परिश्रम किया हुआ सर्टिफिकेट। हमने ये अविश्वास का भाव तोड़ा और सेल्फ एटेस्टेशन को ही पर्याप्त माना। मेरे देश का नागरिक कहता है कि भई ये मैं कह रहा हूं, मैं उस पर भरोसा करता हूं।

साथियों,

हमारे देश में ऐसे-ऐसे प्रावधान चल रहे थे, जहां ज़रा-जरा सी गलतियों को भी गंभीर अपराध माना जाता था। हम जन-विश्वास कानून लेकर आए, और ऐसे सैकड़ों प्रावधानों को डी-क्रिमिनलाइज किया है।

साथियों,

पहले बैंक से हजार रुपए का भी लोन लेना होता था, तो बैंक गारंटी मांगता था, क्योंकि अविश्वास बहुत अधिक था। हमने मुद्रा योजना से अविश्वास के इस कुचक्र को तोड़ा। इसके तहत अभी तक 37 lakh crore, 37 लाख करोड़ रुपए की गारंटी फ्री लोन हम दे चुके हैं देशवासियों को। इस पैसे से, उन परिवारों के नौजवानों को भी आंत्रप्रन्योर बनने का विश्वास मिला है। आज रेहड़ी-पटरी वालों को भी, ठेले वाले को भी बिना गारंटी बैंक से पैसा दिया जा रहा है।

साथियों,

हमारे देश में हमेशा से ये माना गया कि सरकार को अगर कुछ दे दिया, तो फिर वहां तो वन वे ट्रैफिक है, एक बार दिया तो दिया, फिर वापस नहीं आता है, गया, गया, यही सबका अनुभव है। लेकिन जब सरकार और जनता के बीच विश्वास मजबूत होता है, तो काम कैसे होता है? अगर कल अच्छी करनी है ना, तो मन आज अच्छा करना पड़ता है। अगर मन अच्छा है तो कल भी अच्छा होता है। और इसलिए हम एक और अभियान लेकर आए, आपको सुनकर के ताज्जुब होगा और अभी अखबारों में उसकी, अखबारों वालों की नजर नहीं गई है उस पर, मुझे पता नहीं जाएगी की नहीं जाएगी, आज के बाद हो सकता है चली जाए।

आपको ये जानकर हैरानी होगी कि आज देश के बैंकों में, हमारे ही देश के नागरिकों का 78 thousand crore रुपया, 78 हजार करोड़ रुपए Unclaimed पड़ा है बैंको में, पता नहीं कौन है, किसका है, कहां है। इस पैसे को कोई पूछने वाला नहीं है। इसी तरह इन्श्योरेंश कंपनियों के पास करीब 14 हजार करोड़ रुपए पड़े हैं। म्यूचुअल फंड कंपनियों के पास करीब 3 हजार करोड़ रुपए पड़े हैं। 9 हजार करोड़ रुपए डिविडेंड का पड़ा है। और ये सब Unclaimed पड़ा हुआ है, कोई मालिक नहीं उसका। ये पैसा, गरीब और मध्यम वर्गीय परिवारों का है, और इसलिए, जिसके हैं वो तो भूल चुका है। हमारी सरकार अब उनको ढूंढ रही है देशभर में, अरे भई बताओ, तुम्हारा तो पैसा नहीं था, तुम्हारे मां बाप का तो नहीं था, कोई छोड़कर तो नहीं चला गया, हम जा रहे हैं। हमारी सरकार उसके हकदार तक पहुंचने में जुटी है। और इसके लिए सरकार ने स्पेशल कैंप लगाना शुरू किया है, लोगों को समझा रहे हैं, कि भई देखिए कोई है तो अता पता। आपके पैसे कहीं हैं क्या, गए हैं क्या? अब तक करीब 500 districts में हम ऐसे कैंप लगाकर हजारों करोड़ रुपए असली हकदारों को दे चुके हैं जी। पैसे पड़े थे, कोई पूछने वाला नहीं था, लेकिन ये मोदी है, ढूंढ रहा है, अरे यार तेरा है ले जा।

साथियों,

ये सिर्फ asset की वापसी का मामला नहीं है, ये विश्वास का मामला है। ये जनता के विश्वास को निरंतर हासिल करने की प्रतिबद्धता है और जनता का विश्वास, यही हमारी सबसे बड़ी पूंजी है। अगर गुलामी की मानसिकता होती तो सरकारी मानसी साहबी होता और ऐसे अभियान कभी नहीं चलते हैं।

साथियों,

हमें अपने देश को पूरी तरह से, हर क्षेत्र में गुलामी की मानसिकता से पूर्ण रूप से मुक्त करना है। अभी कुछ दिन पहले मैंने देश से एक अपील की है। मैं आने वाले 10 साल का एक टाइम-फ्रेम लेकर, देशवासियों को मेरे साथ, मेरी बातों को ये कुछ करने के लिए प्यार से आग्रह कर रहा हूं, हाथ जोड़कर विनती कर रहा हूं। 140 करोड़ देशवसियों की मदद के बिना ये मैं कर नहीं पाऊंगा, और इसलिए मैं देशवासियों से बार-बार हाथ जोड़कर कह रहा हूं, और 10 साल के इस टाइम फ्रैम में मैं क्या मांग रहा हूं? मैकाले की जिस नीति ने भारत में मानसिक गुलामी के बीज बोए थे, उसको 2035 में 200 साल पूरे हो रहे हैं, Two hundred year हो रहे हैं। यानी 10 साल बाकी हैं। और इसलिए, इन्हीं दस वर्षों में हम सभी को मिलकर के, अपने देश को गुलामी की मानसिकता से मुक्त करके रहना चाहिए।

साथियों,

मैं अक्सर कहता हूं, हम लीक पकड़कर चलने वाले लोग नहीं हैं। बेहतर कल के लिए, हमें अपनी लकीर बड़ी करनी ही होगी। हमें देश की भविष्य की आवश्यकताओं को समझते हुए, वर्तमान में उसके हल तलाशने होंगे। आजकल आप देखते हैं कि मैं मेक इन इंडिया और आत्मनिर्भर भारत अभियान पर लगातार चर्चा करता हूं। शोभना जी ने भी अपने भाषण में उसका उल्लेख किया। अगर ऐसे अभियान 4-5 दशक पहले शुरू हो गए होते, तो आज भारत की तस्वीर कुछ और होती। लेकिन तब जो सरकारें थीं उनकी प्राथमिकताएं कुछ और थीं। आपको वो सेमीकंडक्टर वाला किस्सा भी पता ही है, करीब 50-60 साल पहले, 5-6 दशक पहले एक कंपनी, भारत में सेमीकंडक्टर प्लांट लगाने के लिए आई थी, लेकिन यहां उसको तवज्जो नहीं दी गई, और देश सेमीकंडक्टर मैन्युफैक्चरिंग में इतना पिछड़ गया।

साथियों,

यही हाल एनर्जी सेक्टर की भी है। आज भारत हर साल करीब-करीब 125 लाख करोड़ रुपए के पेट्रोल-डीजल-गैस का इंपोर्ट करता है, 125 लाख करोड़ रुपया। हमारे देश में सूर्य भगवान की इतनी बड़ी कृपा है, लेकिन फिर भी 2014 तक भारत में सोलर एनर्जी जनरेशन कपैसिटी सिर्फ 3 गीगावॉट थी, 3 गीगावॉट थी। 2014 तक की मैं बात कर रहा हूं, जब तक की आपने मुझे यहां लाकर के बिठाया नहीं। 3 गीगावॉट, पिछले 10 वर्षों में अब ये बढ़कर 130 गीगावॉट के आसपास पहुंच चुकी है। और इसमें भी भारत ने twenty two गीगावॉट कैपेसिटी, सिर्फ और सिर्फ rooftop solar से ही जोड़ी है। 22 गीगावाट एनर्जी रूफटॉप सोलर से।

साथियों,

पीएम सूर्य घर मुफ्त बिजली योजना ने, एनर्जी सिक्योरिटी के इस अभियान में देश के लोगों को सीधी भागीदारी करने का मौका दे दिया है। मैं काशी का सांसद हूं, प्रधानमंत्री के नाते जो काम है, लेकिन सांसद के नाते भी कुछ काम करने होते हैं। मैं जरा काशी के सांसद के नाते आपको कुछ बताना चाहता हूं। और आपके हिंदी अखबार की तो ताकत है, तो उसको तो जरूर काम आएगा। काशी में 26 हजार से ज्यादा घरों में पीएम सूर्य घर मुफ्त बिजली योजना के सोलर प्लांट लगे हैं। इससे हर रोज, डेली तीन लाख यूनिट से अधिक बिजली पैदा हो रही है, और लोगों के करीब पांच करोड़ रुपए हर महीने बच रहे हैं। यानी साल भर के साठ करोड़ रुपये।

साथियों,

इतनी सोलर पावर बनने से, हर साल करीब नब्बे हज़ार, ninety thousand मीट्रिक टन कार्बन एमिशन कम हो रहा है। इतने कार्बन एमिशन को खपाने के लिए, हमें चालीस लाख से ज्यादा पेड़ लगाने पड़ते। और मैं फिर कहूंगा, ये जो मैंने आंकडे दिए हैं ना, ये सिर्फ काशी के हैं, बनारस के हैं, मैं देश की बात नहीं बता रहा हूं आपको। आप कल्पना कर सकते हैं कि, पीएम सूर्य घर मुफ्त बिजली योजना, ये देश को कितना बड़ा फायदा हो रहा है। आज की एक योजना, भविष्य को Transform करने की कितनी ताकत रखती है, ये उसका Example है।

वैसे साथियों,

अभी आपने मोबाइल मैन्यूफैक्चरिंग के भी आंकड़े देखे होंगे। 2014 से पहले तक हम अपनी ज़रूरत के 75 परसेंट मोबाइल फोन इंपोर्ट करते थे, 75 परसेंट। और अब, भारत का मोबाइल फोन इंपोर्ट लगभग ज़ीरो हो गया है। अब हम बहुत बड़े मोबाइल फोन एक्सपोर्टर बन रहे हैं। 2014 के बाद हमने एक reform किया, देश ने Perform किया और उसके Transformative नतीजे आज दुनिया देख रही है।

साथियों,

Transforming tomorrow की ये यात्रा, ऐसी ही अनेक योजनाओं, अनेक नीतियों, अनेक निर्णयों, जनआकांक्षाओं और जनभागीदारी की यात्रा है। ये निरंतरता की यात्रा है। ये सिर्फ एक समिट की चर्चा तक सीमित नहीं है, भारत के लिए तो ये राष्ट्रीय संकल्प है। इस संकल्प में सबका साथ जरूरी है, सबका प्रयास जरूरी है। सामूहिक प्रयास हमें परिवर्तन की इस ऊंचाई को छूने के लिए अवसर देंगे ही देंगे।

साथियों,

एक बार फिर, मैं शोभना जी का, हिन्दुस्तान टाइम्स का बहुत आभारी हूं, कि आपने मुझे अवसर दिया आपके बीच आने का और जो बातें कभी-कभी बताई उसको आपने किया और मैं तो मानता हूं शायद देश के फोटोग्राफरों के लिए एक नई ताकत बनेगा ये। इसी प्रकार से अनेक नए कार्यक्रम भी आप आगे के लिए सोच सकते हैं। मेरी मदद लगे तो जरूर मुझे बताना, आईडिया देने का मैं कोई रॉयल्टी नहीं लेता हूं। मुफ्त का कारोबार है और मारवाड़ी परिवार है, तो मौका छोड़ेगा ही नहीं। बहुत-बहुत धन्यवाद आप सबका, नमस्कार।