భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం అత్యంత బలంగా కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పేర్కొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను నమోదైన 7.7 శాతం వార్షిక జీడీపీ వృద్ధి రేటు, అదే ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో నమోదైన 7.8 శాతం వృద్ధి రేటే ఇందుకు నిదర్శనమని ఆయన తెలిపారు. ఈ గణాంకాలు దేశ ఆర్థిక వ్యవస్థ అంతర్గత బలాన్ని, ప్రభుత్వం చేపట్టిన సంస్కరణల విజయాన్ని, 140 కోట్ల మంది భారతీయుల కష్టాన్ని ప్రతిబింబిస్తున్నాయని ప్రధానమంత్రి కొనియాడారు.
ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించడం, వ్యాపార అనుకూలతను మెరుగుపరచడం వంటి అంశాల్లో దేశాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని శ్రీ మోదీ స్పష్టం చేశారు. దేశంలోని యువతకు మరిన్ని కొత్త అవకాశాలను కల్పించేందుకు నిరంతర ప్రయత్నాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి వేగం అత్యంత బలంగా సాగుతోంది..
2025-26 ఆర్థిక సంవత్సరంలో 7.7 శాతం జీడీపీ వృద్ధి రేటు, అలాగే నాలుగో త్రైమాసికంలో 7.8 శాతం వృద్ధి రేటు నమోదు కావడం.. మన ఆర్థిక వ్యవస్థ అంతర్గత శక్తికి, సంస్కరణల విజయానికి, 140 కోట్ల మంది భారతీయుల కష్టానికి నిదర్శనం.
ప్రజల జీవన విధానాన్ని సులభతరం చేయడానికి, వ్యాపార అనుకూలతను పెంచడానికి, మన యువతకు అవకాశాలను విస్తృతం చేయడానికి మేం శాయశక్తులా కృషి చేస్తూనే ఉంటాం’’.
India’s growth momentum remains strong!
— Narendra Modi (@narendramodi) June 5, 2026
GDP growth rate of 7.7% in FY 2025-26 and 7.8% in Q4 of FY 2025-26 reflect the inherent strength of our economy, the success of reforms and the hard work of 140 crore Indians.
We shall leave no stone unturned to further ‘Ease of Living,’…


