మధ్యతరగతి జీవన సౌలభ్యాన్ని పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్యంగా ప్రస్తావించారు. మధ్యతరగతి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా కృషి చేయడం ప్రభుత్వానికి దక్కిన సౌభాగ్యమని ఆయన అన్నారు. దేశ నిర్మాణంలో మధ్యతరగతి లెక్కలేనన్ని మార్గాల్లో తోడ్పాటును అందించిందని ఆయన తెలిపారు.
గత పది సంవత్సరాల్లో, సామాన్య ప్రజానీకం జీవన నాణ్యతను మెరుగుపరచడంపై పరిపాలన మరింత ఎక్కువగా దృష్టిని కేంద్రీకరించిందని కూడా శ్రీ మోదీ అన్నారు. అవకాశాలను సులభంగా చెంతకు చేర్చడం, మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించడం, ప్రజా సేవలను పెంపొందింపచేయడం, తక్కువ ఖర్చులో ఆరోగ్యసంరక్షణ, నాణ్యత కలిగిన విద్యను అందించడం, నగరాల్లో స్వచ్ఛతకు ప్రాధాన్యాన్ని ఇవ్వడం, రోజువారీ జీవన భారాలను తగ్గించడం ధ్యేయంగా ప్రభుత్వ ప్రయత్నాలు సాగాయని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి వరుసగా కొన్ని సందేశాలను పొందుపరుస్తూ:
‘‘మధ్యతరగతి కోసం పాటుపడే ప్రభుత్వం...
మన మధ్యతరగతి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా పనిచేస్తుండడం ఎన్‌డీఏ ప్రభుత్వానికి దక్కిన సౌభాగ్యం. వారు దేశ నిర్మాణానికి ఎనలేని కృషి చేశారు.
సాధారణ పౌరుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి పాలన వ్యవస్థ గత దశాబ్ద కాలానికి పైగా దృష్టిని కేంద్రీకరించింది. అవకాశాల చెంతకు సులభంగా చేర్చడం, మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన, ప్రజా సేవలను పెంపొందించడం, తక్కువ ఖర్చులో ఆరోగ్యసంరక్షణ, నాణ్యత కలిగిన విద్య, స్వచ్ఛ నగరాలతో పాటు నిత్య జీవన భారాలను తగ్గించే దిశగా మా ప్రయత్నాలు సాగుతున్నాయి’’.
12YearsOfSakshamMiddleClass”
A Government for the middle class…
— Narendra Modi (@narendramodi) June 15, 2026
It is the NDA Government’s privilege to be working towards fulfilling the aspirations of our middle class. They have contributed to nation-building in countless ways.
Over the last decade, governance has increasingly focused on improving the…
‘‘మధ్యతరగతి కోసం జీవన సౌలభ్యం ఏ విధంగా మెరుగయ్యిందన్నది ఇక్కడ చూడొచ్చు...’’ అని పేర్కొన్నారు.
12YearsOfSakshamMiddleClass”
A glimpse of how ‘Ease of Living’ is being enhanced for the middle class. #12YearsOfSakshamMiddleClass https://t.co/B6bKCsjyRq
— Narendra Modi (@narendramodi) June 15, 2026


