కాశ్మీర్ లోయకు తొలి సరకు రవాణా రైలు చేరుకోవటం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. జాతీయ సరకు రవాణా నెట్‌వర్క్‌తో ఈ ప్రాంతాన్ని అనుసంధానించడంలో ఇదొక ముఖ్యమైన ఘట్టం.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా కేంద్ర రైల్వే- కమ్యూనికేషన్లు, ఎలక్ట్రానిక్స్ - ఐటీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ చేసిన పోస్ట్‌పై స్పందించిన ప్రధాని.. జమ్మూ కాశ్మీర్ వృద్ధి, అభివృద్ధి.. రెండింటినీ ఇది పెంచుతుందని అన్నారు.
‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు:
"జమ్మూ కాశ్మీర్‌లో వాణిజ్యం, అనుసంధానతకు ఇదొక గొప్ప రోజు. ఇది వృద్ధి, అభివృద్ధి రెండింటినీ పెంచుతుంది"
Great day for commerce and connectivity in Jammu and Kashmir! It will enhance both progress and prosperity. https://t.co/IFLcfmZvuW
— Narendra Modi (@narendramodi) August 9, 2025


