మిజోరాం అవతరణ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
కరుణ, సౌహార్ద్రత విలువలు తమలో నింపుకొన్న మిజోరాం ప్రజల సామాజిక స్ఫూర్తిని, ఉదార స్వభావాన్ని ప్రధానమంత్రి కొనియాడారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో చేసిన పోస్టులో శ్రీ మోదీ ఇలా అన్నారు:
‘‘రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా మిజోరాం ప్రజలకు శుభాకాంక్షలు.
అద్భుతమైన ప్రకృతి సౌందర్యం, సంస్కృతీ సంప్రదాయాలకు మిజోరాం ప్రసిద్ధి చెందింది. సామాజిక స్ఫూర్తి, ఉదార స్వభావం కలిగిన ప్రజల్లో కరుణ, సౌహార్ద్రత విలువలు ప్రతిబింబిస్తాయి. సంస్కృతి, సంగీతం, ఇతర దైనందిన కార్యక్రమాల ద్వారా వ్యక్తమయ్యే ఘనమైన మిజో సంస్కృతి స్ఫూర్తిదాయకమైంది.
వృద్ధి పథంలో మిజోరాం మరింత ముందుకు వెళ్లాలని, భవిష్యత్తులో అనేక విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను’’.
Greetings to the people of Mizoram on their Statehood Day.
— Narendra Modi (@narendramodi) February 20, 2026
Mizoram is widely known for its striking natural beauty and enduring cultural traditions. Its strong community spirit and gracious people embody values of kindness and compassion. The rich Mizo heritage, expressed…


