ఈద్-ఉల్-ఫిత్ర్ పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ఈద్-ఉల్-ఫిత్ర్ నేపథ్యంలో అందరికీ శుభాకాంక్షలు... ఈ పండుగ మన సమాజంలో ఆశావహ స్ఫూర్తిని, సామరస్యం, కరుణను పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నాను. మీరు చేపట్టే ప్రతి కార్యంలోనూ విజయం సిద్ధించాలని, జీవితాల్లో ఆనందం వెల్లివిరియాలని ఆ దైవాన్ని ప్రార్థిస్తున్నాను....
ఈద్ ముబారక్!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
Greetings on Eid-ul-Fitr.
— Narendra Modi (@narendramodi) March 31, 2025
May this festival enhance the spirit of hope, harmony and kindness in our society. May there be joy and success in all your endeavours.
Eid Mubarak!


