* గత కొన్నేళ్లలో సమష్టిగా చేసిన ప్రయత్నాలతో ఆసియాకు చెందిన సింహాల సంఖ్య పెరుగుతూపోతోంది; ఆసియా సింహాల నివాస స్థానాలను పరిరక్షించడంలో పరిసర ప్రాంతాల గిరిజన సముదాయాలు, మహిళలు పోషించిన పాత్ర కూడా ప్రశంసనీయమే: ప్రధాని
ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వన్యప్రాణులను చూడడానికి గిర్ వెళ్లారు. రాచఠీవి ఉట్టిపడే ఆసియా సింహాల నివాసంగా గిర్ సుపరిచితమే.
‘‘గిర్‌కు సంబంధించిన మరికొన్ని దృశ్యాలు ఇవిగో. రాబోయే కాలంలో మీరంతా గిర్‌ సందర్శించాలని మిమ్మల్ని నేను కోరుతున్నాను.’’

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు  వన్యప్రాణులను చూడడానికి గిర్ వెళ్లారు. రాచఠీవి ఉట్టిపడే ఆసియా సింహాల నివాసంగా గిర్ సుపరిచితమే.
 
ఈ సందర్శనను గురించి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా రాశారు:  

‘‘ఈ ఉదయం, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (#WorldWildlifeDay) సందర్భంగా, వన్యప్రాణులను గమనించడానికి గిర్ వెళ్లాను. మనకందరికీ తెలుసు.. గిర్ రాజసం ఉట్టిపడే ఆసియా సింహాల నిలయమని. అక్కడికి చేరుకోవడంతోనే, నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మేమందరం కలసి చేపట్టిన పనుల జ్ఞాపకాలనేకం ఒక్కసారిగా నా మదిలో మెదిలాయి.  చాలా ఏళ్లపాటు చేసిన ఉమ్మడి ప్రయత్నాల వల్ల ఆసియా సింహాల సంఖ్య పెరుగుతూపోతోంది. ఆసియా సింహాల నివాసస్థానాన్ని పరిరక్షించడంలో చుట్టుపక్కల ప్రాంతాల్లోని గిరిజన సముదాయాలు, మహిళలు పోషించిన పాత్ర కూడా అంతే ప్రశంసనీయంగా ఉంది.’’
 
‘‘గిర్‌కు సంబంధించిన మరికొన్ని దృశ్యాలు ఇవిగో. రాబోయే కాలంలో మీరంతా గిర్‌ సందర్శించాలని మిమ్మల్ని నేను కోరుతున్నాను.’’  
 
‘‘ఈ ఉదయం గిర్‌ వెళ్లి అక్కడ సింహాలతోపాటు ఆడసింహాలను చూశాను. కొన్ని ఫోటోలను కూడా తీశాను.’’

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Railways' financial health improves in last 10 yrs, surplus revenue after meeting cost: Ashwini Vaishnaw

Media Coverage

Railways' financial health improves in last 10 yrs, surplus revenue after meeting cost: Ashwini Vaishnaw
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 7 ఫెబ్రవరి 2026
February 07, 2026

Empowering the Nation: Trade Deals, Tech Innovations, and Rural Revival Under PM Modi