శ్రీ హరివంశ్‌ ను గౌరవ రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ చేసిన నేపథ్యంలో... ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన భావి పార్లమెంటరీ పదవీకాలం ఫలప్రదం కావాలని ప్రధాని అభిలషించారు.

పత్రికారచనకూ, ప్రజాజీవనానికీ శ్రీ హరివంశ్ అమూల్యమైన సేవలను అందించారనీ, గౌరవాన్విత మేధావిగా, ఆలోచనాపరునిగా గుర్తింపు తెచ్చుకున్నారనీ ప్రధానమంత్రి అన్నారు. ఆయన ప్రభావవంతమైన ఆలోచనలతో పాటు విస్తృత అవగాహన గత కొన్నేళ్లలో సభా కార్యకలాపాల్ని సుసంపన్నం చేశాయని శ్రీ మోదీ తెలిపారు. శ్రీ హరివంశ్‌ను నామినేట్ చేయడంపై ప్రధాని సంతోషాన్ని వ్యక్తం చేశారు. శ్రీ హరివంశ్ సభా కార్యకలాపాల్లో నిరంతరం పాలుపంచుకోవడం పార్లమెంట్ కార్యకలాపాలను మరింత ఫలప్రదం చేయనుందని ప్రధాని అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ,
‘‘హరివంశ్ గారు పత్రికారచనతో పాటు ప్రజాజీవన రంగానికి కూడా అమూల్యమైన సేవలను అందించారు. ఆయన మేధావి.. ఆలోచనపరుడు. ఆయన ప్రభావవంతమైన ఆలోచనలూ, అవగాహనా గత కొన్నేళ్లలో సభా కార్యకలాపాల్ని సుసంపన్నం చేశాయి. రాష్ట్రపతి గారు ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయడం ఎంతో సంతోషదాయకం. ఆయన పార్లమెంట్ పదవీ కాలం సఫలమవ్వాలని కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
After Modi's Push For Domestic Tourism, Here Are 8 Places Seeing A Surge

Media Coverage

After Modi's Push For Domestic Tourism, Here Are 8 Places Seeing A Surge
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 25 మే 2026
May 25, 2026

Economic Powerhouse Meets Compassionate Leadership: India’s Rise Under PM Narendra Modi