ఈ రోజు తిరు రజనీకాంత్ గారి 75వ పుట్టినరోజు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
రజనీకాంత్ గారి నటన భిన్న తరాల ప్రేక్షకులను ఆకట్టుకుందనీ, ఆయనకు సర్వత్ర ప్రశంసలు లభించాయనీ ప్రధానమంత్రి అన్నారు. వేర్వేరు పాత్రలు, శైలులు, సినిమా తరహా స్టైళ్లు.. ఇవన్నీ రజనీ సినిమాల్లో మనం గమనించవచ్చని, ఆయన సినిమాలు భారత చలనచిత్ర రంగంలో నిరంతరం కొత్త ప్రమాణాలను నెలకొల్పాయని ప్రధానమంత్రి అన్నారు.
ఈ ఏడాది తిరు రజనీకాంత్ చలనచిత్ర సీమలో 50 ప్రఖ్యాత సంవత్సరాలు పూర్తి చేసుకోవడం కూడా ఒక విశేష ప్రాముఖ్యత కలిగిన అంశం. ఇది ఆయన ప్రగతి ప్రస్థానాన్నీ, చిత్ర పరిశ్రమపై ప్రసరిస్తున్న చిరకాల ప్రభావాన్నీ, అందిస్తున్న సాటిలేని సేవనూ సూచిస్తోందన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో వేర్వేరు సందేశాల్లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు:
‘‘తిరు రజనీకాంత్ గారికి ఆయన 75వ పుట్టినరోజు ప్రత్యేక సందర్భంగా ఇవే శుభాకాంక్షలు. ఆయన నటన విభిన్న తరాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. సర్వత్ర గొప్ప ప్రశంసలను పొందింది. ఆయన వృత్తి జీవనంలో రక రకాల భూమికలను, శైలులను ఆవిష్కరించి నిరంతరం అనేక ప్రమాణాలను నెలకొల్పుతున్నారు. ఈ సంవత్సరం మరో విశేషం కూడా ఉంది.. చలనచిత్ర జగతిలో ఆయన 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయనకు ఆరోగ్యవంతమైన జీవనం లభించాలనీ, దీర్ఘాయుష్షు కలగాలనీ ప్రార్థిస్తున్నాను.’’
Greetings to Thiru Rajinikanth Ji on the special occasion of his 75th birthday. His performances have captivated generations and have earned extensive admiration. His body of work spans diverse roles and genres, consistently setting benchmarks. This year has been notable because…
— Narendra Modi (@narendramodi) December 12, 2025
திரு ரஜினிகாந்த் அவர்களின் 75-வது பிறந்தநாள் எனும் சிறப்பான தருணத்தில் அவருக்கு வாழ்த்துகள். அவரது நடிப்பாற்றல் பல தலைமுறைகளைக் கவர்ந்துள்ளது; பரவலான பாராட்டைப் பெற்றுள்ளது. அவரது திரையுலகப் படைப்புகள் பல்வேறு பாத்திரங்கள் மற்றும் பாணிகளில் பரவி, தொடர்ச்சியான முத்திரைகளைப்…
— Narendra Modi (@narendramodi) December 12, 2025


