భాయీ దూజ్ ఈ రోజు.. ఈ శుభ సందర్భంగా దేశ పౌరులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.
‘ఎక్స్’లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘భాయీ దూజ్ సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. సోదరీ సోదరుల పరస్పర ప్రేమకూ, విశ్వాసానికీ ప్రతీకైన ఈ పండగ ప్రతి ఒక్కరి జీవనంలో సుఖాన్నీ, సమృద్ధినీ, సౌభాగ్యాన్నీ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. ఈ సంబంధం మరింత బలపడాలని నేను అభిలషిస్తున్నాను.’’
आप सभी को भाई दूज की बहुत-बहुत शुभकामनाएं। भाई-बहन के आपसी प्रेम और विश्वास का यह प्रतीक-पर्व हर किसी के जीवन में सुख, समृद्धि और सौभाग्य लेकर आए। इस रिश्ते की डोर को एक नई मजबूती मिले, यही कामना है।
— Narendra Modi (@narendramodi) October 23, 2025


