ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

వికసిత్ భారత్ నిర్మాణమనే సమష్టి స్వప్నాన్ని బలోపేతం చేయడానికి ఉపరాష్ట్రపతి అనేక ప్రయత్నాలు చేస్తున్నారని ప్రధానమంత్రి అన్నారు. పార్లమెంటరీ కార్యకలాపాల ఉత్పాదకతను, ప్రభావాన్ని పెంచేందుకు ఉపరాష్ట్రపతి చేపడుతున్న నిరంతర ప్రయత్నాలు ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకున్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తున్నాయని శ్రీ మోదీ తెలియజేశారు.

సర్వతోముఖాభివృద్ధి పట్ల ఉపరాష్ట్రపతికున్న గొప్ప ఆసక్తి, పేదలు అణగారిన వర్గాల పట్ల ఉన్న తపన స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి అన్నారు. చిత్తశుద్ది, క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యంతో ఆయన ప్రజాజీవితం కొనసాగుతోందని తెలిపారు. దేశ సేవలో నిమగ్నమైన ఆయనకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయువు సిద్ధించాలని శ్రీ మోదీ ప్రార్థించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి పోస్టు:

‘‘ఉపరాష్ట్రపతి శ్రీ సీపీ రాధాకృష్ణన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. వికసిత్ భారత్ నిర్మాణమనే మన సమష్టి ఆకాంక్షను బలోపేతం చేసేందుకు ఆయన అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. పార్లమెంటరీ కార్యకలాపాల ఉత్పాదకతను, ప్రభావాన్ని పెంపొందించడానికి ఉపరాష్ట్రపతి చేస్తున్న నిరంతర ప్రయత్నాలు ప్రజాస్వామ్య విలువల పట్ల ఆయనకున్న అంకితభావాన్ని ప్రతిబింబిస్తున్నాయి. సర్వతోముఖాభివృద్ధి పట్ల ఆయనకున్న ఆసక్తి, పేదలు, అణగారిన వర్గాల వారి పట్ల తపన కూడా స్ఫూర్తిదాయకమే. అంకితభావం, క్రమశిక్షణ, స్పష్టమైన లక్ష్యంతో ఆయన ప్రజా జీవితం కొనసాగుతోంది. దేశ సేవలో నిమగ్నమైన ఆయనకు మంచి ఆరోగ్యం, సంతోషం, దీర్ఘాయువు సిద్ధించాలని ప్రార్ధిస్తున్నాను.’’

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India's defence production more than double in five years, hits record Rs 1.78 lakh crore

Media Coverage

India's defence production more than double in five years, hits record Rs 1.78 lakh crore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister shares Sanskrit Subhashitam highlighting the virtues of truth, service, learning and action
June 18, 2026

The Prime Minister, Shri Narendra Modi said that wealth follows truthfulness, fame follows selfless service, knowledge follows constant practice and wisdom follows action. He noted that these values play a vital role in shaping individual character and contributing to collective progress.

The Prime Minister shared a Sanskrit Subhashitam-

“सत्यानुसारिणी लक्ष्मीः कीर्तिस्त्यागानुसारिणी।

अभ्याससारिणी विद्या बुद्धिः कर्मानुसारिणी।।”

The Prime Minister wrote on X;