ప్రజ్ఞానంద సాధించిన అసాధారణమైన ఘనతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అభినందనలు తెలిపారు. ప్రజ్ఞానంద కెరీర్‌లో ఇదొక అద్భుతమైన మైలురాయి అని, అతని నిరంతర ప్రతిభకు నిదర్శనమని ప్రధాని కొనియాడారు. ఈ సందర్భంగా ప్రజ్ఞానంద భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.
‘‘ఈ అద్భుత ఘనత సాధించిన ప్రజ్ఞానందకు అభినందనలు..
ఇది ఆయన నిరంతర ప్రతిభను చాటిచెప్పే ఒక అద్భుతమైన మైలురాయి.
- ఆయన భవిష్యత్తు ప్రయత్నాలు విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’’
Congratulations to Praggnanandhaa for this remarkable feat!
— Narendra Modi (@narendramodi) June 6, 2026
This is indeed an incredible milestone that highlights his continued excellence.
My best wishes to him for his future endeavours. @rpraggnachess https://t.co/ryE0qElL9G


