శ్రీ తో లామ్... వియత్నాం అధ్యక్ష పదవికి ఎన్నికైన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు హృదయపూర్వక అభినందనలను తెలియజేశారు.
కొత్త అధ్యక్షుని నాయకత్వంపై ప్రధానమంత్రి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాల పరీక్షకు తట్టుకొని నిలిచిన భారత్, వియత్నాంల మైత్రి రాబోయే కాలంలో మరింత బలోపేతం అవుతుందని ప్రధాని అన్నారు. రెండు దేశాల ప్రజలతో పాటు ఈ ప్రాంతం కూడా పురోగమించేలా, సమృద్ధి పథంలో పయనించేలా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి కలిసి పనిచేయాలని కోరుకుంటున్నానని శ్రీ మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘వియత్నాం అధ్యక్ష పదవికి శ్రీ తో లామ్ ఎన్నికైన సందర్భంగా ఆయనకు హార్దిక అభినందనలు. కాలపరీక్షకు తట్టుకొని నిలిచిన మన రెండు దేశాల మైత్రి ఆయన నాయకత్వంలో మరింత బలోపేతం అవుతుందని నేను నమ్ముతున్నాను. రెండు దేశాల ప్రజలతో పాటు ఈ ప్రాంతం కూడా పురోగమించేలా, సమృద్ధి పథంలో పయనించేలా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించడానికి మనం కలిసి పని చేయడం కోసం నేను ఎదురుచూస్తున్నాను’’ అని పేర్కొన్నారు.
Heartiest congratulations to Mr. To Lam on his election as President of the Socialist Republic of Vietnam. I am confident that under his leadership, the time-tested friendship between our two countries will continue to grow from strength to strength. I look forward to working…
— Narendra Modi (@narendramodi) April 7, 2026


