నేపాల్‌కు ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ బాలేంద్ర షాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు. ‘‘ఈ పదవీ బాధ్యతలు నేపాల్ ప్రజలు మీ నాయకత్వంపై పెట్టుకున్న నమ్మకానికి అద్దం పడుతున్నాయి. భారత్, నేపాల్ ప్రజల పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు దేశాల మైత్రినీ, సహకారాన్నీ మరింత ఉన్నత శిఖరాలకు తీసుకుపోవడానికి మీతో కలిసి పనిచేయాలనుంది’’ అని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘నేపాల్ ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ బాలేంద్ర షాను హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను.
ఈ పదవీ బాధ్యతలు... మీ నాయకత్వంపై నేపాల్ ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి అద్దం పడుతున్నాయి. భారత్, నేపాల్ ప్రజల పరస్పర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు దేశాల మైత్రినీ, సహకారాన్నీ మరింత ఉన్నత శిఖరాలకు తీసుకుపోవడానికి మీతో కలిసి పనిచేయాలనుంది’’ అని తెలిపారు.
Warm congratulations to Mr. Balendra Shah on being sworn in as the Prime Minister of Nepal.
— Narendra Modi (@narendramodi) March 27, 2026
Your appointment reflects the trust reposed in your leadership by the people of Nepal. I look forward to working closely with you to take India-Nepal friendship and cooperation to even…
नेपाल के प्रधानमंत्री पद की शपथ लेने पर बालेंद्र शाह जी को हार्दिक बधाई!
— Narendra Modi (@narendramodi) March 27, 2026
आपका कार्यभार संभालना नेपाल की जनता द्वारा आपके नेतृत्व में भरोसे को जताता है। मुझे विश्वास है कि हम मिलकर भारत-नेपाल की मित्रता और सहयोग को एक नई ऊंचाई पर ले जाएंगे, जो दोनों देशों के लोगों के पारस्परिक…


