థాయ్‌లాండ్ నూతన ప్రధానమంత్రిగా ఎన్నికైన శ్రీ అనుటిన్ చార్న్‌విరాకుల్‌కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

భారత్-థాయ్‌లాండ్ బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి నూతన థాయ్ నాయకత్వంతో కలిసి పనిచేయడానికి తాను ఎంతో ఆసక్తిగా ఉన్నానని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఉమ్మడి నాగరికత వారసత్వం, సన్నిహిత సాంస్కృతిక సంబంధాలు, ప్రజల మధ్యనున్న బలమైన అనుబంధాలే రెండు దేశాల మధ్య బంధానికి పునాది అని ఆయన తెలిపారు. ఇరు దేశాల ప్రజల శాంతి, పురోగతి శ్రేయస్సు కోసం భారత్-థాయిలాండ్ కలిసి పనిచేస్తాయని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

"థాయ్‌లాండ్ ప్రధానిగా ఎన్నికైన శ్రీ అనుటిన్ చార్న్‌విరకుల్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఆయనతో కలిసి పని చేసేందుకు నేను ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ఇరు దేశాల మధ్య ఉన్న బహుముఖ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత లోతుగా బలోపేతం చేద్దాం. ఉమ్మడి నాగరికత వారసత్వం, సన్నిహిత సాంస్కృతిక అనుబంధం, ప్రజల మధ్య ఉన్న శక్తిమంతమైన సంబంధాలపై మన రెండు దేశాల మధ్య బంధాలు ఆధారపడి ఉన్నాయి. ఇరు దేశాల ప్రజల శాంతి, ప్రగతి, శ్రేయస్సు కోసం భారత్, థాయ్‌లాండ్‌లు ఎల్లప్పుడూ ఐక్యంగా పనిచేస్తాయి’’.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
PM Modi hails India’s ‘Mission Drishti’ launch as ‘world’s first OptoSAR satellite’ enters orbit

Media Coverage

PM Modi hails India’s ‘Mission Drishti’ launch as ‘world’s first OptoSAR satellite’ enters orbit
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 4 మే 2026
May 04, 2026

Green Roads, Smart Tolls, Trillion-Dollar Dreams: How PM Modi's Policies are Supercharging a Modern India