ఎస్‌డీఏటీ స్క్వాష్ ప్రపంచ కప్ - 2025లో మొదటిసారి ప్రపంచ కప్ సాధించి చరిత్ర సృష్టించిన భారత స్క్వాష్ బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు అభినందించారు.
జోష్న చిన్నప్ప, అభయ్ సింగ్, వేలవన్ సెంథిల్ కుమార్, అనాహత్ సింగ్ చేసిన అద్భుతమైన ప్రదర్శనను శ్రీ మోదీ కొనియాడారు. వారి అంకిత భావం, క్రమశిక్షణ, సంకల్పం దేశాన్ని గర్వంతో ఉప్పొంగిపోయేలా చేసిందన్నారు. అంతర్జాతీయ వేదికపై పెరుగుతున్న భారతీయ క్రీడా సామర్థ్యాన్ని ఈ విజయం ప్రతిబింబిస్తోందని ఆయన తెలియజేశారు.
ఈ విజయం దేశవ్యాప్తంగా అనేక మంది యువ అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుందని, దేశ యువతలో స్క్వాష్ పట్ల ఆసక్తిని మరింత పెంపొందిస్తుందని ప్రధానమంత్రి తెలియజేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ పోస్టు:
‘‘ఎస్‌డీఏటీ స్క్వాష్ ప్రపంచ కప్-2025లో మొదటి సారి ప్రపంచ కప్ సాధించి చరిత్ర సృష్టించిన భారత స్క్వాష్ బృందానికి అభినందనలు!
జోష్న చిన్నప్ప, అభయ్ సింగ్, వేలవన్ సెంథిల్ కుమార్, అనాహత్ సింగ్ అద్భుతమైన అంకితభావాన్ని, సంకల్పాన్ని ప్రదర్శించారు. వారి విజయం దేశం మొత్తాన్ని గర్వపడేలా చేసింది. అలాగే యువతలో స్క్వాష్ పట్ల ఆసక్తిని పెంపొందిస్తుంది.
Congratulations to the Indian Squash Team for creating history and winning their first-ever World Cup title at SDAT Squash World Cup 2025!
— Narendra Modi (@narendramodi) December 15, 2025
Joshna Chinnappa, Abhay Singh, Velavan Senthil Kumar and Anahat Singh have displayed tremendous dedication and determination. Their success… pic.twitter.com/hJNF3mPSXt


