ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ 2021 పోటీలలో రజత పతకం సాధించిన అన్షు మాలిక్‌ను, కాంస్య పతకం సాధించిన సరితా మోర్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.
ఇందుకు సంబంధించి ట్విట్టర్ ద్వారా ఒక సందేశమిస్తూ ప్రధానమంత్రి,
" ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్ షిప్ 2021 లో రజత పతకం సాధించినందుకు ఒలి అన్షుకు , కాంస్య పతకం సాధించినందుకు సరితా మోర్‌కు అభినందనలు, అద్భుత ప్రతిభ కనబరచిన ఈ క్రీడాకారుల భవిష్యత్ ప్రయత్నాలకు శుభాభినందనలు " అని పేర్కొన్నారు.
Congratulations to @OLyAnshu for winning the Silver and @saritamor3 for winning the Bronze at the World Wrestling Championship 2021. Best wishes to these outstanding athletes for their future endeavours. pic.twitter.com/2HNzheJ6G7
— Narendra Modi (@narendramodi) October 10, 2021