ప్రముఖ నటుడు శ్రీ సలీం కుమార్ మరణం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సంతాపం వ్యక్తం చేశారు. ఆయన సుదీర్ఘమైన నటనా జీవితంలో ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలను పోషించి, తనదైన ముద్ర వేయటమే కాక, ఎప్పటికీ మరచిపోలేని ప్రదర్శనలను ఇచ్చారని ప్రధానమంత్రి అన్నారు.

ఈ విచారకర సమయంలో ఆ దిగ్గజ నటుడి కుటుంబ సభ్యులకు, ఆయన అభిమానులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.

"ప్రముఖ నటుడు శ్రీ సలీం కుమార్ మరణవార్త నన్ను కలచి వేసింది. సుదీర్ఘమైన ఆయన నటనా ప్రస్థానంలో విభిన్నమైన పాత్రలను పోషించి, తనదైన ముద్ర వేశారు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. ఓం శాంతి".

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
India’s continuing tradition of celebrating its teachers

Media Coverage

India’s continuing tradition of celebrating its teachers
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 5 సెప్టెంబర్ 2026
September 05, 2026

The New Indian Equation: Policy + People = Tangible Progress Under PM Modi