లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా సేవలు అందించిన డాక్టర్ సుభాష్ సి. కశ్యప్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపాన్ని తెలిపారు.

డాక్టర్ కశ్యప్ భారత్‌లో ప్రముఖ రాజ్యాంగ కోవిదులలో ఒకరనీ, పార్లమెంటుకు సంబంధించిన కార్యకలాపాలతో పాటు రాజ్యాంగ పరమైన విధుల నిర్వహణలో ఆయన అందించిన తోడ్పాటు మన సమాజాన్ని సుసంపన్నం చేసిందనీ ప్రధానమంత్రి అన్నారు. డాక్టర్ కశ్యప్ రచనలూ, ప్రజాస్వామిక సంస్థలను పటిష్ఠపరచడంలో ఆయన కనబరిచిన నిబద్ధత ప్రశంసనీయమని శ్రీ మోదీ అన్నారు. డాక్టర్ కశ్యప్ కుటుంబానికీ, స్నేహితులకీ ప్రధానమంత్రి సంతాపాన్ని తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి పొందుపరుస్తూ:

‘‘లోక్‌సభ సెక్రటరీ జనరల్‌గా ఇంతకు ముందు సేవలు అందించిన డాక్టర్ సుభాష్ సి. కశ్యప్ కన్నుమూశారని తెలిసి బాధపడ్డాను. ఆయన భారత్‌లో ప్రముఖ రాజ్యాంగ కోవిదులలో ఒకరు. పార్లమెంటుకు సంబంధించిన కార్యకలాపాలతో పాటు రాజ్యాంగ పరమైన విధులలో ఆయన అందించిన తోడ్పాటు మన సమాజాన్ని సుసంపన్నం చేసింది. ఆయన రచనలతో పాటు ప్రజాస్వామిక సంస్థలను పటిష్ఠపరచడంలో ఆయన నిబద్ధత ప్రశంసనీయం. ఆయన కుటుంబానికీ, స్నేహితులకీ సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓమ్ శాంతి’’ అని పేర్కొన్నారు.

 

Explore More
శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

శ్రీరామ జన్మభూమి ఆలయ ధ్వజారోహణ ఉత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
Indian economy navigated well external uncertainties: RBI Bulletin

Media Coverage

Indian economy navigated well external uncertainties: RBI Bulletin
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 23 జూలై 2026
July 23, 2026

Digital Rails, PLI Jobs & Swift Justice: How PM Modi’s Governance is Rewiring India’s Future