భారత అణుశక్తి కార్యక్రమ దిగ్గజం డాక్టర్ ఎం.ఆర్. శ్రీనివాసన్ మృతిపట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:
“భారత అణుశక్తి కార్యక్రమ దిగ్గజం డాక్టర్ ఎం.ఆర్. శ్రీనివాసన్ మృతి అత్యంత బాధాకరం. కీలకమైన అణు మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి మనం ఇంధన రంగంలో స్వావలంబన సాధించడానికి పునాదులు వేసింది. అణుశక్తి కమిషన్‌కు ఆయన స్ఫూర్తిదాయకమైన నాయకత్వం చిరస్మరణీయం. శాస్త్రీయ పురోగతి, అనేక మంది యువ శాస్త్రవేత్తలకు మార్గనిర్దేశం చేసిన ఆయనకు భారత్ ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుంది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబం, స్నేహితులకు సానుభూతి తెలుపుతున్నాను. ఓం శాంతి.”
భారత అణుశక్తి కార్యక్రమ దిగ్గజం డాక్టర్ ఎం.ఆర్. శ్రీనివాసన్ మృతి అత్యంత బాధాకరం. ఆయన కృషి మనం ఇంధన రంగంలో స్వావలంబన సాధించడానికి పునాదులు వేసింది. ఆయన స్ఫూర్తి చిరస్మరణీయం...
Deeply saddened by the passing of Dr. MR Srinivasan, a stalwart of India's nuclear energy program. His instrumental role in developing critical nuclear infrastructure has been foundational to our being self-reliant in the energy sector. He is remembered for his inspiring…
— Narendra Modi (@narendramodi) May 20, 2025


