గుజరాత్ నుంచి రాజ్య సభ సభ్యుడైన శ్రీ అభయ్ భరద్వాజ్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
‘‘గుజరాత్ నుంచి రాజ్య సభ సభ్యుడైన శ్రీ అభయ్ భరద్వాజ్ గారు ఒక ప్రఖ్యాత న్యాయవాది గా ఉండే వారు. అంతేకాక, సమాజానికి సేవ చేయడం లో కూడా ఆయన ముందు భాగం లో నిలచారు. మనం ఒక వివేకవంతుడైనటువంటి, అంతర్ దృష్టి కలిగినటువంటి, దేశాభివృద్ధి అంటే మక్కువ ను కనబరచేటటువంటి వ్యక్తి ని కోల్పోవడం దుఃఖదాయకం. ఆయన కుటుంబానికి, ఆయన మిత్రులకు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఓమ్ శాంతి’’ అని ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
Rajya Sabha MP from Gujarat, Shri Abhay Bharadwaj Ji was a distinguished lawyer and remained at the forefront of serving society. It is sad we have lost a bright and insightful mind, passionate about national development. Condolences to his family and friends. Om Shanti.
— Narendra Modi (@narendramodi) December 1, 2020


