మేఘాలయలోని తూర్పు జైంతియా కొండల్లో ఈ రోజు జరిగిన ప్రమాద దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి మృతుల కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొన్నది:
“మేఘాలయలోని తూర్పు జైంతియా కొండల్లో జరిగిన ప్రమాదం బాధాకరం. ఆత్మీయులను కోల్పోయిన వారికి సంతాపం తెలుపుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల పరిహారాన్ని అందిస్తాం. క్షతగాత్రులకు రూ. 50,000 అందజేస్తాం: ప్రధానమంత్రి @narendramodi”
Pained by the mishap in East Jaintia Hills, Meghalaya. Condolences to those who lost their loved ones. May the injured recover at the earliest.
— PMO India (@PMOIndia) February 5, 2026
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM…


