ఆంధ్రప్రదేశ్‌లో అనకాపల్లి జిల్లాలో గల ఒక ఫ్యాక్టరీలో ఆదివారం దుర్ఘటన సంభవించిన కారణంగా ప్రాణనష్టం జరిగినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన వ్యక్తులకు ఒక్కొక్కరికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను వారి సంబంధికులకు చెల్లించనున్నట్లు ఆయన ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50,000 వంతున ఇవ్వనున్నారు.
ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో ఇలా పేర్కొంది:
"ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో ఓ ఫ్యాక్టరీలో దుర్ఘటన ప్రాణ నష్టానికి దారి తీయడం అత్యంత బాధాకరం. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. దుర్ఘటన బాధితులకు స్థానిక పాలన యంత్రాంగం సహాయక చర్యలు చేపడుతోంది.
మరణించిన ప్రతి వ్యక్తికీ పీఎం ఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను ఆ వ్యక్తి కుటుంబానికి అందజేస్తాం. గాయపడిన వారికి ఒక్కొక్కరికి రూ. 50,000 చొప్పున అందిస్తాం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (@narendramodi)"
Deeply saddened by the loss of lives in a factory mishap in Anakapalli district of Andhra Pradesh. Condolences to those who have lost their loved ones. May the injured recover soon. The local administration is assisting those affected.
— PMO India (@PMOIndia) April 13, 2025
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would…
"ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా ఫ్యాక్టరీ ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టం అత్యంత బాధాకరం. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. స్థానిక యంత్రాంగం బాధితులకు సహకారం అందజేస్తోంది. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు పి.ఎం.ఎన్.ఆర్.ఎఫ్. నుంచి రూ. 2 లక్షలు ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి రూ. 50,000 అందజేయడం జరుగుతుంది : PM@narendramodi"
ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లా ఫ్యాక్టరీ ప్రమాదంలో జరిగిన ప్రాణనష్టం అత్యంత బాధాకరం. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. స్థానిక యంత్రాంగం బాధితులకు సహకారం అందజేస్తోంది.
— PMO India (@PMOIndia) April 13, 2025
ఈ ప్రమాదంలో…


