ఉత్తరప్రదేశ్‌లోని ఫరీద్‌పూర్ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ శ్యామ్ బిహారీ లాల్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు సంతాపం వ్యక్తం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
“ఉత్తరప్రదేశ్‌లోని ఫరీద్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ శ్రీ శ్యామ్ బిహారి లాల్జ్ మృతి వార్త నన్ను తీవ్రంగా బాధించింది. ఆయన అంకితభావంతో, కష్టపడి పనిచేసే బీజేపీ నాయకుడు. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటు. ఈ దుఃఖ సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి!’’
उत्तर प्रदेश के फरीदपुर के विधायक डॉ. श्याम बिहारी लाल जी के निधन से अत्यंत दुख हुआ है। वे जनहित में समर्पित भाजपा के एक कर्मठ नेता थे, जिनके जाने से पार्टी को अपूरणीय क्षति हुई है। शोक की इस घड़ी में उनके परिजनों और समर्थकों के प्रति मेरी गहरी संवेदनाएं। ओम शांति! pic.twitter.com/TCv0ddOg3B
— Narendra Modi (@narendramodi) January 2, 2026


