సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణనష్టానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ప్రగాఢ సంతాపం ప్రకటించారు.
ప్రధానమంత్రి కార్యాలయం ఈ మేరకు ట్వీట్ చేస్తూ
‘‘సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణనష్టం చాలా బాధించింది. బాధిత కుటుంబాలన్నింటికీ సానుభూతి ప్రకటిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను’’ అని పేర్కొంది.
Pained by the loss of lives due to a fire tragedy in Swapnalok Complex, Secunderabad. My thoughts are with the bereaved families. May the injured recover soon: PM @narendramodi
— PMO India (@PMOIndia) March 17, 2023


